Tirumala: తిరుమలలో తృటిలో తప్పించుకున్న చిరుత, ఎలుగుబంటి.. సీసీటీవీ వీడియో.
తిరుమల అలిపిరి నడకదారిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. రాత్రి సమయాల్లో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిన్న రాత్రి చిరుతను, ఎలుగుబంటిని బందించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి తృటిలో తప్పించుకున్నాయి. ట్రాప్ చేసేందుకు ఏర్పాటు చేసిన బోను దగ్గరికి వచ్చిన చిరుత వెనక్కి వెళ్లిపోయింది.
తిరుమల అలిపిరి నడకదారిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. రాత్రి సమయాల్లో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిన్న రాత్రి చిరుతను, ఎలుగుబంటిని బందించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి తృటిలో తప్పించుకున్నాయి. ట్రాప్ చేసేందుకు ఏర్పాటు చేసిన బోను దగ్గరికి వచ్చిన చిరుత వెనక్కి వెళ్లిపోయింది. గతంలో మూడు చిరుతలు ట్రాప్‌కి గురైన చోటే, ఇప్పుడు ఈ చిరుత కూడా సంచరిస్తోంది. 100 మంది సిబ్బందితో ఈ ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. మరోవైపు మత్తు ఇచ్చి ఎలుగుబంటిని ట్రాప్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుత, ఎలుగుబంటిని ట్రాప్ చేస్తే నడకమార్గంలో క్రూరమృగాల ప్రమాదం తప్పినట్లేనని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...