AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇకపై 24 కాదు 12 గంటల్లోనే.! ఇది కదా హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..

వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై ఎండీ సుదర్శన్ రెడ్డి జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా..

Hyderabad: ఇకపై 24 కాదు 12 గంటల్లోనే.! ఇది కదా హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
Hyderabad
Sravan Kumar B
| Edited By: |

Updated on: Apr 23, 2024 | 9:26 PM

Share

వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌పై ఎండీ సుదర్శన్ రెడ్డి జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ టైమ్ తదితర వివరాల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా డెలివరీ చేయాలన్నారు. తొందర్లోనే ట్యాంకర్ డెలివరీ సమయాన్ని 12 గంటలకు తగ్గించాలని సూచించారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. జలమండలి తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నగరంలోని సగానికి పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నామని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి నుంచి ఈ రోజు వరకు పరిస్థితిని బట్టి.. రాబోయే రెండు నెలలకు ప్రణాళికలు రచించాలన్నారు. పెరిగిన ట్యాంకర్లు, ట్రిప్పులు, డెలివరీలు.. మార్చి నెలతో పోలిస్తే.. కొత్త ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామన్నారు.

రాత్రి వేళల్లో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయడంతో.. పెండింగ్ బాగా తగ్గించుకున్నామని తెలిపారు. ఇలాగే ప్రత్యేక దృష్టి పెడితే బుక్ చేసిన 12 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేసే వీలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చి నెలలో మొత్తం 1,68,996 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశామన్నారు. ఈ నెలలో 22వ తేదీ నాటికే 1,67,134 ట్రిప్పులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. కాగా మార్చి 31 నాటికి 613 ట్యాంకర్లు ఉండగా.. ప్రస్తుతం 816 వరకు పెంచుకున్నట్లు తెలిపారు. మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకుంటామని వివరించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎంసీసీకి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా మంచినీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు, కలుషిత నీరు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే మురుగు నీటి నిర్వహణపైనా దృష్టి సారించాలని సూచించారు. నీటి సరఫరాలో ఉద్దశ పూర్వకంగా ఆటంకాలు కలుగజేస్తే.. ఎలాంటి వారైనా సహించేది లేదని హెచ్చిరించారు. అలాగే ట్యాంకర్ల మళ్లింపు విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.