AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సారీ మై బాయ్.. ఇక నువ్వు సంతోషంగా ఉండు.. వాట్సాప్‌ స్టేటస్ పెట్టి యువతి సూసైడ్.. అసలు ఏం జరిగింది!

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కలిసి జీవిద్దాం అనుకున్నారు.. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఒక రోజు యువతి వాట్సాప్‌ స్టేటస్‌లో.. మనం ఫ్యూచర్‌లో కలిసి ఉండలేం.. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాం.. నేను లేకపోతేను నువ్వు ప్రశాంతంగా ఉంటావు.. అందుకే నేను వెళ్తున్నా..సారీ మై బాయ్ అనే మెసేజ్ కనిపించింది. ఆ తెల్లారే యువతి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. ఇంతకు ఇద్దరి మధ్య ఏం జరిగింది.

సారీ మై బాయ్.. ఇక నువ్వు సంతోషంగా ఉండు.. వాట్సాప్‌ స్టేటస్ పెట్టి యువతి సూసైడ్.. అసలు ఏం జరిగింది!
Anand T
|

Updated on: Dec 23, 2025 | 12:34 PM

Share

మనం ఫ్యూచర్‌లో కలిసి ఉండలేం.. మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాం.. నేను లేకపోతేను నువ్వు ప్రశాంతంగా ఉంటావు.. అందుకే నేను వెళ్తున్నా..సారీ మై బాయ్ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి.. ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన కూతురిని చూసి షాక్‌కు గురైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం.. అల్మాస్‌గూడ ఎస్‌ఎస్‌రెడ్డినగర్‌కు చెందిన విహారిక అనే యువతి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కళాశాలలో బీటెక్ ‌ చదువుతోంది. అయితే ఆమెకు అల్మాస్‌గూడకు చెందిన కిషోర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో గత 6 నెలలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

అయితే ఆదివారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి విహారిక.. పడుకునేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. కానీ ఉదయం పొద్దెక్కినా నిద్రలేవ లేదు.. దీంతో విహారికను లేపేందుకు తల్లిదండ్రులు వెళ్లగా.. అక్కడ ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించంది. అది చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిడ్డను కిందకు దించి కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, పరిసరప్రాంతాలను పరిశీలించారు. యువతి మొబైల్‌ను చెక్‌ చేయగా.. చివరగా ఆమె వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్‌ను గుర్తించారు. దీనిపై కుటుంబ సభ్యులను పోలీసులు ఆరా తీయగా.. యువతీ, యువలకు ప్రేమకు తాము అంగీకరించామని.. అయినప్పిటికీ అతని ప్రవర్తన నచ్చకపోవడంతో తమ కుమార్తె కిషోర్‌తో మాట్లాడడం మానేసిందని చెప్పారు. అయినా కిషోర్ మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని విహారికను వేధించినట్టు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్ వాసులకు తీపికబురు.. మెట్రో ప్రయాణంలో..
హైదరాబాద్ వాసులకు తీపికబురు.. మెట్రో ప్రయాణంలో..
ఎవరు ఈ శాంటా క్లాజ్‌..? ఎరుపు దుస్తులు, తెల్లటి గడ్డం వెనుక విషయం
ఎవరు ఈ శాంటా క్లాజ్‌..? ఎరుపు దుస్తులు, తెల్లటి గడ్డం వెనుక విషయం
ఈజీగా వల వేస్తారు.. చిక్కితే మీ ప్రాణాలు పోయినట్టే..
ఈజీగా వల వేస్తారు.. చిక్కితే మీ ప్రాణాలు పోయినట్టే..
వాట్సాప్‌ స్టేటస్ పెట్టి యువతి సూసైడ్.. అసలు ఏం జరిగిందంటే!
వాట్సాప్‌ స్టేటస్ పెట్టి యువతి సూసైడ్.. అసలు ఏం జరిగిందంటే!
డిసెంబర్ 31లోపు ఈ పని చేయకపోతే మీ డబ్బులు వృధానే.. మర్చిపోకండి
డిసెంబర్ 31లోపు ఈ పని చేయకపోతే మీ డబ్బులు వృధానే.. మర్చిపోకండి
ఐపీఎల్ కోసం అదిరిపోయే ప్లాన్.. సౌతాఫ్రికాకు పంపిస్తున్న LSG!
ఐపీఎల్ కోసం అదిరిపోయే ప్లాన్.. సౌతాఫ్రికాకు పంపిస్తున్న LSG!
2026 మీ జీవితంలో అద్భుతం కావాలా.. ఇంట్లో ఈ మార్పులు చేయండి!
2026 మీ జీవితంలో అద్భుతం కావాలా.. ఇంట్లో ఈ మార్పులు చేయండి!
ఒత్తిడి నుంచి బయటపడాలా.. అయితే తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే!
ఒత్తిడి నుంచి బయటపడాలా.. అయితే తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే!
గ్రామ పంచాయతీ వింతైన ఉత్తర్వులు.. వింటే షాక్!
గ్రామ పంచాయతీ వింతైన ఉత్తర్వులు.. వింటే షాక్!
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతి
ఫ్రీగా పైరసీ సినిమాలు చూస్తున్నారా?.. ఆ యాప్ వాడితే ఇక అంతే సంగతి