KCR: అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. ఇంజనీరింగ్ భాషే తెలియదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌ నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయి.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం.. కేసీఆర్‌ ఆనవాళ్లను తీసేస్తామని రేవంత్‌ అన్నారు.. మీరు కూర్చున్న సచివాలయం నేను కట్టిందే.. యాదాద్రి ఆలయం కట్టింది నేనే కూలగొడతారా..? కేసీఆర్‌ అంటే హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ.. నా ఆనవాళ్లను తీసేయడం ఎవరి వల్లా కాదు.. అంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు.

KCR: అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. ఇంజనీరింగ్ భాషే తెలియదు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
KCR Revanth Reddy
Follow us

|

Updated on: Apr 23, 2024 | 9:52 PM

కాంగ్రెస్‌ నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయి.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం.. కేసీఆర్‌ ఆనవాళ్లను తీసేస్తామని రేవంత్‌ అన్నారు.. మీరు కూర్చున్న సచివాలయం నేను కట్టిందే.. యాదాద్రి ఆలయం కట్టింది నేనే కూలగొడతారా..? కేసీఆర్‌ అంటే హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ.. నా ఆనవాళ్లను తీసేయడం ఎవరి వల్లా కాదు.. ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్‌ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారు.. అంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు. టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న కేసీఆర్.. సంచలన విషయాలను పంచుకున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ పట్టుబడ్డారని.. తెలంగాణను అస్థిరపరిచేందుకు రేవంత్ కుట్ర చేశారంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణను ఎడారి చేసేందుకు కాంగ్రెస్ చూస్తుందని.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే సహించనంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం నుంచి రిపేర్ వరకు కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 50 వేల మంది రైతులను తీసుకెళ్లి ధర్నా చేస్తానని.. ఎవరు అడ్డం వచ్చినా కాళేశ్వరం రిపేర్‌ చేయిస్తా అంటూ KCR అన్నారు. రూ.100 కోట్లతో పిల్లర్లను రిపేర్‌ చేయొచ్చు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్లాక్‌ని రిపేర్ చేయకపోయినా.. వందేళ్ల వరకు మిగతా బ్లాక్‌లు పదిలంగా ఉంటాయన్నారు. మహానదులపై కట్టే ప్రాజెక్టుల్లో లోపాలు సహజమని.. తెలంగాణకు నీళ్లు తేవాలని మాత్రమే చూశామని.. కానీ.. తనను బద్నాం చేయాలని కాంగ్రెస్‌ నీళ్లు వదల్లేదన్నారు.

రైతుల పంటలను ఎండబెట్టారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉత్తమ్‌కుమార్‌ దారుణంగా మాట్లాడారని.. చూస్తూ ఊరుకోను అంటూ పేర్కొన్న కేసీఆర్ ఎవరు అడ్డం వచ్చినా కాళేశ్వరం రిపేర్‌ చేయిస్తా అంటూ స్పష్టంచేశారు. తెలంగాణపై సమైక్యపాలకులు వివక్ష చూపారని.. ఒక్క ప్రాజెక్ట్‌ను కూడా పూర్తి చేయలేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టులను మొదలుపెట్టి వదిలేశారని.. ఎత్తిపోతల మినహా తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదంటూ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ 85 మీటర్ల ఎత్తులో ఉంటుంది.. సమ్మక్క బ్యారేజీ దగ్గర 70 మీటర్ల ఎత్తు ఉంది.. సీతమ్మసాగర్‌ దగ్గర 47 మీటర్ల ఎత్తు ఉందని తెలిపారు. కాకతీయులు 75 వేల చెరువులు నిర్మించారు.. నిజాంరాజులు కూడా చెరువులను కొనసాగించారన్నారు.

నాకు ఇంజనీరింగ్ భాషే తెలియదు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డిజైన్‌ తాను చేయలేదని.. తనకు ఇంజినీరింగ్‌ భాషే తెలియదంటూ కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అవసరాలకు తగ్గట్టు రీడిజైన్‌ చేశామని.. సమైక్యపాలనలోనే ఎత్తిపోతలకు అనుమతులు.. దశలవారీగా నీటిని ఎత్తిపోసేలా ప్లాన్‌ చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఢోకా లేదు అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరంలో 200 కి.మీ అండర్‌ టన్నెల్స్‌ ఉన్నాయి.. A-గ్రేడ్ ప్రాజెక్ట్‌ అని సర్టిఫికెట్‌ వచ్చింది.. మేడిగడ్డకు సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చు.. వరద ఉన్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చన్నారు. మేడిగడ్డలో 80కి పైగా గేట్లు ఉన్నాయి.. కాళేశ్వరం నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు.. 150 టీఎంసీల రిజర్వాయర్లు కట్టామని.. 200 టన్నెల్స్‌ క్షేమంగా ఉన్నాయన్నారు. రిజర్వాయర్స్‌, 1500 కి.మీ కాలువలు బాగున్నాయని తెలిపారు. మేడిగడ్డలో 2 పిల్లర్లు కొద్దిగా పగుళ్లు వచ్చాయి. నిర్వహణ కోసం ఈఎన్‌సీని కూడా నియమించామని కేసీఆర్ వివరించారు. రూ.4 వేల కోట్లతో 1200 చెక్‌డ్యామ్‌లు నిర్మించామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?