AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Train Service: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ రూట్‌లో కొత్త ట్రైన్స్‌..

ప్రయాణికులకు రైల్వే శాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త రైల్వే సర్వీసులను ప్రారంభిస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రతిపాధన మేరకు నంద్యాల మీదుగా గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ మధ్య నూతన ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రారంభించేందుకు రైల్వే మంత్రిత్వం శాఖ ఆమోదం తెలిపింది.

New Train Service: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ రూట్‌లో కొత్త ట్రైన్స్‌..
New Train Service
Anand T
|

Updated on: Dec 23, 2025 | 6:21 PM

Share

తక్కువ ఖర్చుతో సుదీర్ఘ ప్రయాణాలు చేయాలనుకునే వారికి రైల్వే ప్రయాణం ఒక మంచి ఎంపిక. అందుకే చాలా మంది ట్రైన్‌లో ప్రయాణించడానికి ఇష్టపడుతారు. అదే కాకుండా ప్రయాణికుల భద్రతా, సౌకర్యం దృష్ట్యా రైల్వే శాఖ చేపడుతున్న మార్పులు కూడా ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీంతో ట్రైన్‌లలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త సర్వీసులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ – గుంతకల్లు (నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపగా.. అందుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలు సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

కొత్త సర్వీస్‌ల వివరాలు

  • గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ – గుంతకల్లు మధ్యన 57407/ 57408 నెంబర్ గల రెండు రోజువారీ ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
  • 57407 నెంబర్‌గల గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ ప్యాసింజర్ ట్రైన్ రోజు సాయంత్రం 5:30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి.. రాత్రి 11:30 గమ్యాస్థానికి చేరకుంటుంది.
  • అలాగే 57408 నెంబర్ గల మార్కాపూర్ రోడ్ – గుంతకల్లు ప్యాసింజర్ ట్రైన్ ఉదయం 04: 30కు మార్కపూర్‌ రోడ్డు నుంచి బయల్దేరి ఉదయం 10:30 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది.

ఈ రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయి

ఈ రైళ్లు మార్గ మధ్యంలో మద్దికెర, పెండేకల్లు, ధోన్ , రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల కృష్ణాపురం, కంబం మరియు తర్లుపాడు స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణంలో ఆగుతాయి.

ఈ నూతన ప్యాసింజర్ రైలు సర్వీసు ప్రారంభం ద్వారా గుంతకల్లు, మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరడమేకాకుండా మార్గ మధ్యంలోని నంద్యాల, గిద్దలూరు, కంభం మొదలైన ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రైలు విద్యార్థులకు, వ్యాపారస్థులకు, ఇతర ప్రయాణికులకు పైన పేర్కొన్న స్టేషన్లకు చేరుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, తక్కువ ఛార్జీతో ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.