APSRTC Jobs 2025: ఏపీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాలు.. రేపట్నుంచే ధ్రువపత్రాల పరిశీలన! తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు ఇవే
APSRTC Apprentices Certificates Verification 2025 Schedule: రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తేదీలను APSRTC విడుదల చేసింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన తేదీలను APSRTC విడుదల చేసింది. ఈ మేరకు ఐటీఐ అభ్యర్థులు విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలనకు ఆయా తేదీల్లో హాజరుకావాల్సి ఉంటుందని ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ వి నీలిమ ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీ సర్టిఫికేట్‌ల పరిశీలన తేదీలను ట్రేడ్‌ల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ జోన్‌లలో ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.
ట్రేడుల వారీగా అభ్యర్థులు హాజరుకావల్సిన తేదీలు ఇవే..
- మోటర్ మెకానిక్, ఫిట్టర్, డ్రాట్స్‌మెన్, సివిల్, వెల్డర్, పెయింటర్ అండ్ మెషినిస్ట్ ట్రేడ్స్‌లకు డిసెంబర్ 24న
- ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌కు డిసెంబర్ 26, 27 తేదీల్లో
- డీజిల్ మెకానిక్ ట్రేడ్‌కు డిసెంబర్ 29, 30 తేదీల్లో
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రొఫైల్, పదో తరగతి సర్టిఫికేట్, ఐటీఐ మార్కుల లిస్టు, ఎన్‌సీవీటీ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఎన్‌సీసీ లేదా స్పోర్ట్స్‌కు సంబంధిత సర్టిఫికేట్ (ఒక వేళ ఉంటే), దివ్యాంగులైతే పీహెచ్‌సీ సర్టిఫికేట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, 2 ఫోటోలు.. అభ్యర్ధులు తమతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకెళ్లవల్సి ఉంటుంది. ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు వాటి జిరాక్స్ కాపీలు 2 సెట్లు తీసుకెళ్లాలి. ప్రాసెసింగ్ ఫీజు రూ.118 చొప్పున ప్రతి ఒక్కరూ చెల్లించాలి. కాగా ఏపీఎస్‌ఆర్టీసీ 291 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




