కొత్త ఏడాదిలోనూ బంగారం ధర.. పైపైకే అంచనావేసిన ఆర్థిక సంస్థలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2026 నాటికి 10 గ్రాముల పసిడి లక్షన్నర దాటుతుందని గోల్డ్‌మన్ సాచ్స్, డబ్ల్యూజీసీ అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ప్రధాన కారణాలు. ఈ భారీ పెరుగుదల సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర భారం మోపనుంది. బంగారం సామాన్యులకు అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉంది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధర రోజురోజుకీ అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతోంది.ఈ ఏడాది ఒకనొకదశలో లక్షా 37వేల రూపాయలు దాటేసింది. ఇంకా వచ్చే ఏడాది బంగారం ధరలు పెరుగుతాయని ప్రపంచ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. బంగారంధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 15 నుంచి 30 శాతం వరకు పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా పసిడి ధరలు ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే 15-30శాతం వరకు పెరగొచ్చు.2026 చివరికి 10 గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరుతుందని.. లక్షా 60వేలు కూడా దాటే చాన్స్ ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ సంస్థ అంచనావేసింది. ఇక.. 2026లో బంగారం ధరలపై ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం 2026 నాటికి బంగారం ధరలు 15 శాతం నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అంతర్జాతీయంగా ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లలో భారీ పెట్టుబడులు వంటి కారణాలు బంగారం ధర పెరగడానికి అని డబ్ల్యూజీసీ చెబుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కొనసాగితే మాత్రం బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. అమెరికా ఆర్థిక వృద్ధి సుస్థిరంగా ఉంటే ధరలు 5 నుంచి 20 శాతం తగ్గే అవకాశం కూడా లేకపోలేదని తన నివేదికలో కౌన్సిల్ తెలిపింది. 2025లో గోల్డ్ రేట్ ఏకంగా 70శాతం పైగానే పెరిగింది. ఈ రేంజ్‌లో 1979లో 120 శాతం పెరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. 2024 డిసెంబర్ 31న పది గ్రాముల బంగారం 78వేల 950రూపాయలు ఉంటే 2025 ఏప్రిల్ 22న లక్ష రూపాయలు దాటి రికార్డ్‌లు సృష్టించింది. ప్రస్తుతం 10గ్రాముల బంగారం ధర లక్షా 36వేల రూపాయల పైనే ఉంది. అలాగే.. 2013లో దాదాపు 30వేలు ఉంటే.. 2024 జనవరిలో 60వేలకు చేరింది. అంటే బంగారం ధర రెండింతలు కావడానికి 11ఏళ్లు పట్టింది. కానీ.. 2024 తర్వాత మాత్రం గోల్డ్ రేట్ ఓ రేంజ్‌లో పెరుగుతూ వస్తోంది. 2024 జనవరి తర్వాత 22నెలలకే బంగారం ధర డబుల్ అవడం షాకిచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌కే లక్షా 20వేలను క్రాస్ చేసి రికార్డ్‌లు బద్దలు కొట్టింది. ఈ క్రమంలోనే.. వచ్చే ఏడాది కూడా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారం ధరల భగభగలు తప్పవంటోంది. అయితే ఆభరణాల కోసం బంగారం కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఈ ధరలు తీవ్ర భారంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పసిడి సామాన్యులకు అందని స్థాయికి చేరే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేమి చలిరా బాబోయ్.. నెలాఖరు దాకా ఇంతేనట
పాక్ బౌలర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్
Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్
సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

