Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బైపోల్ టెన్షన్.. అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్, బీజేపీ తర్జనభర్జన.. పోటీలో ఉన్నదెవరంటే..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎవరు?. బీఆర్ఎస్ క్లారిటీగా ఉంది. సానుభూతి అస్త్రంతో మనల్ని ఎవడ్రా బీట్ చేసేది అన్న ధీమాతో ఉంటే.. కాంగ్రెస్, బీజేపీకి మాత్రం.. అభ్యర్థి వేటలో నిమగ్నం అయ్యాయి. క్యాండేట్ సెలక్షన్‌కు తర్జనభర్జన పడుతున్నాయి. మరి ఈ రెండు పార్టీల్లో పోటీకి సుముఖంగా ఉంది ఎవరు?. 2 జాతీయ పార్టీలు ఎవరి పేర్లను పరిశీలిస్తున్నాయి.

జూబ్లీహిల్స్ బైపోల్.. షెడ్యూల్‌కు ముందే కాక రేపుతోంది. ప్రధాన పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభించింది. మాగంటి సతీమణి సునీతకు టికెట్ కేటాయించి.. జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది. సానుభూతి అస్త్రాన్ని జోడించి.. జూబ్లీహిల్స్ ప్రజలు మాగంటి కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయం వచ్చిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు..
జూబ్లీహిల్స్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాయి అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ.. రెండు పార్టీలు ఈ ఎన్నికను ప్రస్టేజ్‌గా తీసుకుని.. కమిటీలు, సబ్ కమిటీలు, సర్వేలు, సమీక్షలతో బిజీగా మారాయి. అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ త్రిమెన్ కమిటీ నుంచి ఇప్పటికే లిస్ట్ ఖరారైనట్లు తెలుస్తుంది. లిస్ట్‌లో ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, CN రెడ్డి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నటు తెలుస్తుంది. బీఆర్ఎస్ సానుభూతిని బ్రేక్ చేస్తూ పార్టీని గెలుపు తీరాలవైపు తీసుకెళ్లే వారికోసం తీవ్రంగా కసరత్తు చేస్తుంది కాంగ్రెస్. సో ఎలిమినేషన్ తర్వాత ఎవరు ఫైనల్ అవుతారన్నది హస్తం పార్టీలో గుబులు రేపుతుంది.
బీఆర్ఎస్ సానుభూతితో వచ్చినా, బీజేపీ మరో వ్యూహంతో వచ్చినా.. కంటోన్మెంట్ ఫలితాలే జూబ్లీహిల్స్‌లోనూ రిపీట్ అవుతాయంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
మరోవైపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు, కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఎవరికి టికెట్ ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న అంశంపై ఆరా తీశారు. సోమవారం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం..
ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ సైతం.. బై పోల్ పోరుకు సై అంటుంది. బీజేపీకి బ్రాండ్‌గా భావించే అర్బన్ ఏరియా కావడం, యువత ఎక్కువగా ఉండటంతో.. ఉప ఎన్నికలో గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. బీజేపీలోనూ అభ్యర్థి ఎంపిక కోసం త్రిమెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ నుంచి రేసులో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ పేర్లున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారన్నది తేలాల్సి ఉంది.
గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మాత్రమే గెలిచింది. సో.. సిటీ బీఆర్ఎస్ దే అన్న ధీమాతో గులాబీ పార్టీ ఉంది. సునీతపై ఉన్న సానుభూతిని గెలిచే దమ్మున్న నేత కోసమే.. కాంగ్రెస్, బీజేపీ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
