AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మరోసారి ఉలిక్కిపడిన హైదరాబాద్.. మరో టెర్రరిస్ట్ అరెస్ట్.. కొనసాగుతోన్న ఎన్ఐఏ తనిఖీలు..

Hyderabad terror conspiracy case: మే 24వ తేదీన కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు, ఈ కేసులో హట్ తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది. హైదరాబాదులో అరెస్ట్ అయిన సల్మాన్ రాజేంద్రనగర్ లో తలదాచుకుని ఉండగా ఎన్ఐఏ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం సల్మాన్ కు చెందిన రెండు ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హట్ ద్వారా సల్మాన్ రిక్రూట్ మెంట్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Hyderabad: మరోసారి ఉలిక్కిపడిన హైదరాబాద్.. మరో టెర్రరిస్ట్ అరెస్ట్.. కొనసాగుతోన్న ఎన్ఐఏ తనిఖీలు..
Terrorists (representative)
Vijay Saatha
| Edited By: |

Updated on: Aug 01, 2023 | 4:50 PM

Share

హైదరాబాద్‌ ఆగస్టు 1: హైదరాబాద్‌లో మరో టెర్రరిస్ట్ అరెస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది.. గతంలో మధ్యప్రదేశ్ తెలంగాణ పోలీసులు జరిపిన సోదాల్లో హైదరాబాదులో ఆరుగురు అరెస్ట్ అయితే వాళ్లతో సంబంధం ఉన్న మరొక వ్యక్తిని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు.. HUT అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురిని హైదరాబాదులో గతంలో మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ తర్వాత ఆ కేసు ఎన్ఐఏకి బదిలీ అయింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసుని వేగవంతంగా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ – తెలంగాణ మాడ్యుల్ కేసులో మరొక వ్యక్తిని అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది.

మే 24వ తేదీన కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు, ఈ కేసులో హట్ తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది. హైదరాబాదులో అరెస్ట్ అయిన సల్మాన్ రాజేంద్రనగర్ లో తలదాచుకుని ఉండగా ఎన్ఐఏ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం సల్మాన్ కు చెందిన రెండు ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హట్ ద్వారా సల్మాన్ రిక్రూట్ మెంట్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సల్మాన్ ఇంటి నుంచి కీలక పత్రాలతోపాటు.. పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం..

మరోసారి ఉలిక్కిపడ్డ హైదరాబాద్..

గతంలో జరిగిన అరెస్టులు మర్చిపోకముందే మరొక టెర్రరిస్ట్ హైదరాబాద్‌లో అరెస్ట్ కావడంతో.. మరోసారి నగరంలో అలజడి మొదలైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన టెర్రరిస్టులకు హైదరాబాద్ షెల్టర్ గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.. గత రెండేళ్లుగా వరుసగా టెర్రరిస్ట్ కు సంబంధించిన సానుభూతిపరులు పోలీసులకు పట్టుబడుతున్నట్టు హైదరాబాద్ పేరు మరొకసారి చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి