Hyderabad: మహిళలకు శుభవార్త.. ఐటీ కారిడర్ వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆర్టీసీ
ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. సోమవారం రోజున జేఎన్‌టీయూ నుంచి వేవ్‌రాక్ వరకు లేడిస్ స్పెషల్ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. దశలవారిగా .. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు ప్రవేశపెడతామని సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ ఖాన్ వెల్లడించారు.

హైదరాబాద్, ఆగస్టు 1: ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. సోమవారం రోజున జేఎన్‌టీయూ నుంచి వేవ్‌రాక్ వరకు లేడిస్ స్పెషల్ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. దశలవారిగా .. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు ప్రవేశపెడతామని సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ ఖాన్ వెల్లడించారు. అయితే ఈ బస్సు ఉదయం 9.00 AM గంటలకు జేఎన్‌టీయు నుంచి వేవ్‌రాక్‌కు స్టార్ట్ అవుతుంది. డ్యూటీలు ముగిసిన తర్వాత మళ్లీ సాయంత్రం 5.00 PM గంటలకు వేవ్‌రాక్ నుంచి జేఎన్‌టీయూ వరకు స్పెషల్ బస్సులు నడుస్తాయి. అయితే కేవలం ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే కాకుండా హౌస్‌కీపింగ్ వంటి సర్వీస్ రంగంలో పనిచేస్తున్న మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా జీడిమెట్ల, మియాపూర్, కూకట్‌పల్లి తదితర్ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్నాయి.
జేఎన్‌టీయూ వద్ద భారీగా రద్దీ ఉంటోంది. దీంతో మహిళా ప్రయాణీకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేడీస్ కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం రోజున ఓ బస్సును ఏర్పాటు చేశారు. అయితే మొదటి రోజునే మహిళల నుంచి మంచి స్పందన వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వారి కోరిక మేరకు త్వరలోనే మరికొన్ని బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సిటీలోని పలు మార్గాల నుంచి ఐటీ కారిడార్‌లకు త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదటి దశలో దాదాపు 20 ఎలక్ట్రిక్ బస్సులలో కొన్నింటిని వివిధ మార్గాల నుంచి ఐటీ కారిడర్ వైపు నడిపే అవకాశాలు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయానికి సైతం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
