Telangana News: పదిపైగా కేసులు.. ఎట్టకేలకు లేడి డాన్‌ ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు

పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న అంగూర్‌ బాయ్‌ ఎట్టకేలకు అరెస్టయింది. కర్వాన్‌లో ఎక్సైజ్‌ పోలీసులకు అంగూర్‌ బాయ్‌ పట్టుబడింది. అంగూర్‌ బాయ్‌పై హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతంలో పెద్దమొత్తంలోనే కేసులు ఉన్నాయి.

Telangana News: పదిపైగా కేసులు.. ఎట్టకేలకు లేడి డాన్‌ ఆటకట్టించిన హైదరాబాద్ పోలీసులు
Most Wanted Criminal Arrest
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 13, 2024 | 8:46 AM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది కేసుల్లో పోలీసులకు, ఎక్సైజ్‌ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న అంగూర్‌ బాయ్‌ ఎట్టకేలకు అరెస్టయింది. కర్వాన్‌లో ఎక్సైజ్‌ పోలీసులకు అంగూర్‌ బాయ్‌ పట్టుబడింది. అంగూర్‌ బాయ్‌ ధూల్‌పేట్‌ ఏరియాకే గంజాయి డాన్‌గా పేరు తెచ్చుకుంది. ఇంతే కాదు.. అంగూర్ బాయ్ వెనుక పెద్ద క్రైమ్ హిస్టరీయే ఉంది.

గంజాయి అమ్మకాల్లో రూ. కోట్లకు పడుగెత్తిన అంగూర్‌ బాయ్‌పై హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతంలో పెద్దమొత్తంలోనే కేసులు ఉన్నాయి. ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 3 కేసుల్లో, మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో 4 కేసుల్లో, ఆసిఫ్ నగర్, గౌరారం స్టేషన్లలో మొత్తం పది కేసుల్లో అంగూర్ బాయ్ ముద్దాయిగా ఉంది. ఇన్ని కేసులు ఉండి కూడా పోలీసులకు దొరకకుండా ముప్పతిప్పలు పెట్టింది. ఆమె మీద నమోదైన కేసుల్లో భాగంగా అరెస్టు చేయడానికి ఎక్సైజ్‌, పోలీసులు ఎన్నిమార్లు నిఘా పెట్టిన అంగూర్‌ బాయ్‌ తప్పించుకుని తిరిగింది. ఇప్పటికే 13 కేసుల్లో నిందితురాలుగా జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇన్నేళ్లుగా కోర్టుల చుట్టూనే చుట్టు తిరుగుతుందంటే అంగూర్ బాయ్ వెనక ఎంతటి పెద్ద నేర చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంగూర్‌ బాయ్‌ ఒక్కతే కాదు.. ఇంటివాళ్లు కూడా ఆమె నేరాల్లో పాలు పంచుకున్నారు. తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో 10 నుంచి 15 మందిపై ఐదు నుంచి పది కేసులు ఉన్నాయి. ధూల్‌పేట్‌లో గంజాయి హూల్‌సేల్‌, రిటైల్ అమ్మకాల్లో ఆరితేరిన అంగూర్‌ బాయ్‌ని ఆపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా కార్వాణ్‌ ప్రాంతంలో ఎస్‌టీఎఫ్, ఎక్సైజ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎన్నో కేసుల్లో నేరస్తురాలిగా ఉండి, ఎన్నో ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంగూర్‌ బాయ్‌ని అరెస్టు చేసినందుకు గాను ఎస్‌టీఎఫ్, ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి