Telangana News: ఇంట్లోకి దూరి కత్తులు, గన్‌లతో బెదిరించి.. సినిమాలో మాదిరిగా గోల్డ్ దోపిడీ..!

హైదరాబాద్‌లో దుండగులు 10 మంది కలిసి వ్యాపారి ఇంట్లోకి చొరబడి, అక్కడున్న వారిని కత్తులు, తుపాకులతో బెదిరించి కోటి రూపాయలు విలువ చేసే బంగారం తస్కరించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?

Telangana News: ఇంట్లోకి దూరి కత్తులు, గన్‌లతో బెదిరించి.. సినిమాలో మాదిరిగా గోల్డ్ దోపిడీ..!
Stole Gold
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 13, 2024 | 8:49 AM

హైదరాబాద్‌ దోమల్‌గూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన భారీ దోపిడీ ఘటనలో కోటి రూపాయలు విలువ చేసే బంగారం తస్కరించారు. దోమల్‌గూడ ప్రాంతంలోని అరవింద్ కాలనీలో ఉన్న బంగారం వ్యాపారి ఇంటిని దుండగులు లక్ష్యంగా తీసుకుని ఈ దోపిడికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు సృష్టించిన తీరును చూస్తే సినిమాల్లో చూపించే విధంగా ప్లాన్‌ చేసి దోపిడీ చేపట్టారు.

దోపిడీ సమయంలో, దుండగులు 10 మంది కలిసి వ్యాపారి ఇంట్లోకి చొరబడి, అక్కడున్న వారిని కత్తులు, తుపాకులతో బెదిరించారు. వ్యాపారి రంజిత్, అతని సోదరుడి కుటుంబ సభ్యులపై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో దుండగులు ఇంట్లోని లాకర్‌ను బద్దలుకొట్టి 2.5 కిలోల బంగారం, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ఐట్యాబ్‌ను అపహరించారు. అయితే, వాళ్లు సీసీటివి ఫుటేజీలను గుర్తించకుండా ఉండేందుకు డీవీఆర్‌ను ఎత్తుకెళ్లలేదు.

ఈ దాడి సమయంలో వ్యాపారి రంజిత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దుండగుల కత్తులతో అతడిపై దాడి చేయడంతో అతను రక్తస్రావంతో బాధపడుతున్నాడు. ఈ ఘటనపై దోమల్‌గూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీమ్‌ రంగంలోకి దిగింది. బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరించి దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

పోలీసులు బాధితుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దుండగుల స్కెచ్‌లు తయారుచేసి, వీరి కదలికలపై నిఘా పెట్టారు. సంఘటన స్థలంలో అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి, దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. అయితే బాధితుడు ఇంట్లోకి దుండగులు చొరబడటంతో తెలిసినవారే ఈ తరహా ప్లాన్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు గత కొన్ని రోజులుగా ఆయనకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి