HCA Meeting: అజారుద్దీన్‌కు చెక్..! జనవరి 10న HCA ఎన్నికలు.. జనరల్ బాడీ సమావేశంలో కీలక నిర్ణయం..

నిత్యం గొడవలు.. ఆరోపణలు.. అంతర్గత కుమ్ములాటలు. ప్రెసిడెంట్‌గా ఎవరున్నా.. గొడవలు మాత్రం కామన్‌. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కనిపించే సీన్‌ ఇది. తాజాగా గడువు ముగిసినా కొందరు ఇంకా పదవిలో ఉన్నారని కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇంతకీ హెచ్‌సీఏలో అలాంటి వారు ఎవరున్నారు..?

HCA Meeting: అజారుద్దీన్‌కు చెక్..! జనవరి 10న HCA ఎన్నికలు.. జనరల్ బాడీ సమావేశంలో కీలక నిర్ణయం..
Mohammad Azharuddin
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2022 | 4:29 PM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో మళ్లీ లొల్లి షురూ అయ్యింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అజారుద్దీన్‌ పదవీకాలం సెప్టెంబర్‌ 26 వ తేదీకే ముగిసిందని మాజీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇవాళ హెచ్‌సీఏ మాజీ సభ్యులంతా కలిసి ఉప్పల్‌ స్టేడియంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 160 మంది సభ్యులు హాజరయ్యారు. జనవరి 10న ఎన్నికలు జరుపుతామని హెచ్‌సీఏ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. జి.సంపత్‌ను ఎన్నికల అధికారిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పదవీకాలం ముగిసినా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, ఇంకా పదవిలో కొనసాగుతారని HCA మాజీ అధ్యక్షుడు జి.వినోద్‌ మండిపడ్డారు.కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారాయన. క్రికెట్‌ క్లబ్‌ల కార్యదర్శులు ఎన్నికల అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు.

హెచ్‌సీఏ సభ్యులు సమావేశం పెట్టకుండా స్టేడియం బయటే అడ్డుకున్నారని ఆరోపించారు మాజీ సెక్రటరీ శేషు నారాయణ.జనరల్‌ బాడీ లోపల సమావేశం పెట్టుకోవడానికి అనుమతించలేదని మండిపడ్డారు. హెచ్‌సీఏ మెంబర్స్‌ను అజార్‌ అండ్‌ టీమ్‌ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఇటీవలి టిక్కెట్‌ స్కామ్స్‌ విషయంలో అజార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

హెచ్‌సీఏలో కొనసాగుతున్న వివాదంపై అజారుద్దీన్‌ మళ్లీ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఈ లొల్లి ఎటువైపు దారి తీస్తుంది..? మరీ అజార్‌ అండ్‌ టీమ్‌ రిజైన్‌ చేస్తారా..? హెచ్‌సీఏ ఎలక్షన్స్‌ జరుగుతాయా? అనేది వేచిచూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!