Hyderabad: దారుణం.. నవ వధువు కళ్లకు గంతలు కట్టి బాబా అత్యాచారం.. భర్త, అత్తకు చెబితే వారు ఏం చేశారో తెలుసా..?
అడ్డదారిలో సంపాదించేందుకు బాబా అవతారమెత్తాడు.. ఎలాంటి సమస్యకు అయినా చికిత్స చేస్తానంటూ నమ్మబలికి లోబర్చుకుంటాడు.. ఇలా ఆ బాబాను నమ్మి చికిత్స కోసం ఓ నవ వధుకును ఆమె కుటుంబసభ్యులు అక్కడికి తీసుకెళ్లాడు.. కానీ.. ఆ బాబా ఆమెపై కన్నేశాడు.. చివరకు చికిత్స పేరుతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు..

హైదరాబాద్, సెప్టెంబర్ 04: అడ్డదారిలో సంపాదించేందుకు బాబా అవతారమెత్తాడు.. ఎలాంటి సమస్యకు అయినా చికిత్స చేస్తానంటూ నమ్మబలికి లోబర్చుకుంటాడు.. ఇలా ఆ బాబాను నమ్మి చికిత్స కోసం ఓ నవ వధుకును ఆమె కుటుంబసభ్యులు అక్కడికి తీసుకెళ్లాడు.. కానీ.. ఆ బాబా ఆమెపై కన్నేశాడు.. చివరకు చికిత్స పేరుతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు.. చికిత్స నేపంతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తలాబ్ కట్టా నివాసి హాజీతో నెల రోజుల క్రితం వివాహమైంది. బాలిక ఆరోగ్యం విషమించడంతో అత్తమామలు ఆమెను బండ్లగూడా ప్రాంతంలో నివసించే మోసగాడు మజార్ బాబా వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బాబా బాలికను కళ్లకు గంతలు కట్టి గదిలోనే వదిలేశాడు. అనంతరం ఏదో చికిత్స చేస్తున్నట్లు కుటుంబసభ్యులను నమ్మించాడు.
ఆ తర్వాత చికటీ గదిలోకి వెళ్లిన దొంగ బాబా.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన బాలిక తన భర్తకు, అత్తకు బాబా దురాఘతానికి సంబంధించిన అన్ని వివరాలు చెప్పింది. అయితే, అత్త మాత్రం నీ శరీరంపై 5 దెయ్యాలు ఉన్నాయంటూ ఆమెకు చెప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాలిక అత్తా, భర్తకు చెప్పింది. కానీ ఆమె చెప్పింది వినకుండా.. వారు బాలికను 10 రోజుల పాటు ఇంట్లో బంధించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి.. అత్త ఇంటికి చేరుకుని వారిని వాదించింది. అనంతరం బాలికను తన ఇంటికి తీసుకొచ్చి భవానీ నగర్ పోలీసులకు అత్యాచారం విషయంపై ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్రైమ్ నం.0/2023లో సెక్షన్ 354BIPC(1)376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదని బాధితులు ప్రశ్నించగా.. కేసును బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశామని భవానీ నగర్ పోలీసులు చెప్పరు. అయితే ఫైల్ ఇంకా రాలేదని బండ్లగూడ పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మజర్ బాబాపై అత్యాచారం ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో బాలికను ఉరి తీస్తామని అత్తమామలు బెదిరించినట్లు తెలిసింది.




అయితే, నిందితులు వేరే రాష్ట్రానికి పారిపోయారని ఇన్‌స్పెక్టర్ బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్ అలీ తెలిపారు. ఒకవైపు పోలీసులు బాధితులను ఆదుకోవడం లేదని, ఇంకోవైపు అత్తమామలు బెదిరిస్తున్నారని బాలిక, ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..