AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lulu Mall: హైదరాబాద్ అంతా అక్కడే.. ‘లులూ మాల్’కు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక.. తేడా వస్తే.!

హైదరాబాద్‌లోనే అతిపెద్ద లులూ మాల్‌తో ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన  అనగా 10 రోజుల కిందట ఈ లులూ మాల్ ప్రారంభించినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడంతో.. ప్రతీ రోజూ కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంటోంది. వీకెండ్స్ కావడంతో ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతోంది.

Lulu Mall: హైదరాబాద్ అంతా అక్కడే.. 'లులూ మాల్'కు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక.. తేడా వస్తే.!
Lulu Mall
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Oct 07, 2023 | 8:54 PM

Share

హైదరాబాద్, అక్టోబర్ 7: హైదరాబాద్‌లోనే అతిపెద్ద లులూ మాల్‌తో ట్రాఫిక్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన  అనగా 10 రోజుల కిందట ఈ లులూ మాల్ ప్రారంభించినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడంతో.. ప్రతీ రోజూ కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంటోంది. వీకెండ్స్ కావడంతో ఆ సంఖ్య మరింత రెట్టింపు అవుతోంది. గడిచిన 10 రోజులుగా జనాలు ఎగబడడంతో ట్రాఫిక్ పోలీసులకు.. ట్రాఫిక్‌ను నియంత్రించడం పెద్ద టాస్క్‌లా మారింది. ఈ నేపధ్యంలో తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. లులూ మాల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

మాల్‌కు వచ్చే కస్టమర్ల పార్కింగ్ బాధ్యతలను నిర్వాహకులే తీసుకోవాలని సూచించారు. ప్రతీ రోజూ లులూ మాల్‌కు వచ్చే కస్టమర్స్‌కు సరైన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపి వేస్తున్నారు. దీంతో కూకట్‌పల్లి – మియాపూర్, జేఎన్టీయూ – హైటెక్ సిటీ ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంటోంది. దీంతో నిర్వాహకులే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని.. లేదంటే చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే క్రమంలో మరింత మంది సిబ్బందిని పెట్టుకుని ట్రాఫిక్ క్లియర్ చేయాలని సూచించారు పోలీసులు.

పెద్ద సంఖ్యలో వచ్చే కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని వాటికి సరిపడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లులూ మాల్ యాజమాన్యానికి చెప్పారు. గతవారం చోటు చేసుకున్న ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కేవలం లులూ మాల్‌కు వచ్చే కస్టమర్లను కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. దీంతో హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి వెళ్లే వాహనదారుడికి గంటల సమయం పట్టింది. ఈ వారం అలాంటి ఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు లులూ మాల్ నిర్వాహకులే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

ఎవర్రా మీరంతా.. హైదరాబాద్ అంతా ఇక్కడే..

లులూ మాల్ విజువల్స్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..