Hyderabad: భార్యపై కన్నేశాడని.. స్నేహితుడిని హత్యచేసి మూసీ నదిలో పడేసిన వ్యక్తి!
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో దారణం వెలుగు చూసింది. తన భార్యపై కన్నేశాడనే కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన స్నేహితునే హతమార్చాడు. తర్వాత మృతదేహాన్ని వైర్లతో చుట్టి మూసీ నదిలో పడేశాడు. రెండ్రోజుల క్రితం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తాజాగా ఈ దారుణానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు.

తన భార్యపై కన్నేశాడనే కారణంతో స్నేహితునే హతమార్చి మూసీ నదిలో పడేసిన ఘటన అంబర్‌పేట్‌లో వెలుగు చూసింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహమ్మద్ జావేద్, మహమ్మద్ అమీరుల్ హాక్, షోరబ్ ముగ్గురు స్నేహితులు. వీరు బోడుప్పల్ ద్వారకా నగర్‌లో నివాసం ఉంటూ ఫాల్ సీలింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన భార్యతో షోరబ్ ప్రవర్తన తేడా ఉండడంతో ఆమెపై షోరబ్ కన్నేశాడని జావేద్ అనుమానించడం స్టార్ట్ చేశాడు. ఇదే విషయంపై షోరబ్‌ను జావేద్ పలుమార్లు హెచ్చరించాడు. కానీ షోరబ్ ప్రవర్తనలో మార్పురాకపోవడంతో అతన్ను లేపేయాలని ప్లాన్ చేశాడు..
ఈ విషయం అమీర్ హుల్ చెప్పి.. అతని సహాయంతో షోరబ్ హత్యకు జావేద్ ప్లాన్ వేశాడు. ఇద్దరు కలిసి షోరబ్‌కు ఫుల్‌గా మద్యం తాగించి. వైర్లతో గొంతును బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేమాన్ని మొత్తం వైర్లు చేట్టి అంబర్‌పేట్ సమీపంలోని మూసీ నదీలో పడేశారు. బాధితుడి స్నేహితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండ్రోజుల క్రితం మూసీ నదిలో షోరబ్ మృతదేహాన్ని గుర్తించారు. తాజాగా ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అంబర్ పేట పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




