AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓ ఇంటిలో తనిఖీలు.. అనుమానాస్పదంగా కనిపించిన మూడు బ్యాగులు.. తెరిచి చూడగా

సాధారణ తనిఖీల్లో భాగంగా హైదరాబాద్‌లోని నారాయణగూడలో తనిఖీలు చేపట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక వారికీ ఓ ఇంట్లో మూడు పెద్ద బ్యాగులు కనిపించాయి. అందులో ఏమున్నాయోనని చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Hyderabad: ఓ ఇంటిలో తనిఖీలు.. అనుమానాస్పదంగా కనిపించిన మూడు బ్యాగులు.. తెరిచి చూడగా
Representative Image
Ravi Kiran
|

Updated on: Sep 08, 2025 | 9:41 PM

Share

రూ. 1000, రూ. 500 పాత నోట్లు బ్యాన్ అయ్యి దాదాపుగా తొమ్మిదేళ్లు అయింది. అవినీతిపై పోరాడటంలో తొలి అడుగుగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నోట్లను బ్యాన్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రం ఒకటి హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. స్థానిక నారాయణగూడలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ ఇంట్లో అనుమానాస్పదంగా మూడు బ్యాగులు కనిపించాయి. అందులో ఏమున్నాయోనని చూడగా.. రద్దైన రూ. 2 కోట్లు విలువైన రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఆ మూడు పెద్ద బ్యాగులను, నలుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ నోట్లు ఎవరివి.? ఎక్కడ నుంచి వచ్చాయ్.? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.