AP, Telangana News Live: ఉప రాష్ట్రపతి ఎన్నికలో సి.పి. రాధాకృష్ణన్ విజయం.. 152 ఓట్ల మెజార్టీతో గెలుపు
Vice President Election 2025 Live: ఉపరాష్ట్రపతి ఎన్నికలు మొదలైనాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్లమెంటులో పోలింగ్ జరగనుంది. ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటించనున్నారు..

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: భారత 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్లమెంటులో పోలింగ్ జరగనుంది. ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. జులై 21న ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారు. ఆయనకు 2027 ఆగస్ట్ 10 వరకు పదవీ కాలం ఉంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు షురూ చేశారు. అయితే దేశ రాజకీయాల్లో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. ఇందులో ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే ఈ ఓటింగ్‌లో పాల్గొనడంలేదని ఇప్పటికే బీఆర్‌ఎస్ (4), బీజు జనతా దళ్ (7) ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలవనున్నారు. ఇప్పటికే ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం ఉంది. అటు ఇండియా కూటమికి 314 ఓట్లు ఉన్నాయి. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు లేవు. తమిళనాడుకు చెందిన ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి నుంచి బరిలో ఉన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలతోపాటు ఏపీ, తెలంగాణ, నేషనల్ అన్ని వార్తా విశేషాలను ఇక్కడ ఈ లైవ్ బ్లాగ్ లో తెలుసుకోవచ్చు.
LIVE NEWS & UPDATES
-
దేశ నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నిక
ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయన దేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. మరోవైపు, ఇండియా కూటమి తరుఫున పోటీ చేసిన జస్టిస్ బి సుర్దాసన్ రెడ్డి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.
-
దేశ 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్
ఉప రాష్ట్రపతి పదవికి జరిగి ఎన్నికల్లో NDA అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. మొత్తం 781 మంది ఎంపీలలో 14 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మొత్తం 767 ఓట్లు పోల్ అయ్యాయి సి.పి. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, బి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో సి.పి. రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారుల ప్రకటించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ CP రాధాకృష్ణన్ ప్రతిపక్ష పార్టీ ఇండియా బ్లాక్ అభ్యర్థి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి B సుదర్శన్ రెడ్డిపై ఆధిక్యత సంపాదించారు. పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది.
-
-
ఏపీలో 4 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: నీలం సాహ్ని
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం (సెప్టెంబర్ 9) అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.
ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్
* 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి. * అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి. * నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి. * నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి. * డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి. * డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. * చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.
-
నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు!
నేపాల్ సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినా అక్కడ హింసాత్మక ఘటనలు ఆగట్లేదు. రాజధాని ఖాట్మాండులోని పార్లమెంట్ భవనానికి ఆందో ళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ఆ భవనం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు.
-
దసరా మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.
-
-
నేపాల్ రాయబార కార్యాలయం వద్ద భారీ బందోబస్తు
నేపాల్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మండి హౌస్‌లోని నేపాల్ రాయబార కార్యాలయం దగ్గర నిరసన తెలిపేందుకు కొంతమంది రావచ్చని పోలీసులకు సమాచారం అందింది. నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో నేపాల్ రాయబార కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు.
-
రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేష్ ఆశీస్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు జన్మించిన బాబుకి లోకేష్ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా బాబును ఎత్తుకుని ముద్దాడారు. అక్కడే ఉన్న మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి బండారు మాధవీలతని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్.
-
ఉప రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ముగిసింది. 6గంటకు కౌంటింగ్ ప్రారంభమై.. రాత్రి 7 గంటలకు ఫలితాలు వెలువడతాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో 97 శాతం పోలింగ్ నమోదైంది. 768 మంది ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. 13 మంది మినహా మిగతా ఎంపీలంతా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ కు కౌంటింగ్ ఏజెంట్లుగా కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, జెడియు ఎంపీ సంజయ్ కుమార్ ఝా వ్యవహరించనున్నారు. ఇక జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కౌంటింగ్ ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు శక్తి సింగ్ గోహిల్ , మాణికం ఠాగూర్. ఎంతో ఉత్కఠంగా సాగిన ఎన్నికల ఫలితాలు మరికొన్ని నిమిషాల్లో తేలనున్నాయి.
-
ఫార్ములా-E రేస్ కేసులో మరో కీలక పరిణామం..!
ఫార్ములా-E రేస్ కేసులో మరో కీలక పరిణామం.. మాజీ మంత్రి కేటీఆర్ సహా మరో నలుగురి ప్రాసెక్యూషన్‌కి అవినీతి నిరోధక శాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికే కేటీఆర్‌ని నాలుగుసార్లు, ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్‌ని ఐదుసార్లు విచారించింది ఏసీబీ. గవర్నర్ అనుమతి రాగానే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఏసీబీ అడుగుతున్న ప్రాసిక్యూషన్ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారు? 9నెలల విచారణలో ఏసీబీకి దొరికిన బిగ్గెస్ట్ క్లూ ఏంటి? అన్నదీ ఆసక్తికరంగా మారింి.
-
ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌కు వర్షసూచన కొనసాగుతోంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖాధికారి జగన్నాద్ కుమార్ హెచ్చరించారు. వాయువ బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల అవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నా జగన్నాద్ కుమార్ తెలిపారు. బుధవారం అల్లూరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, యన్ టి ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రాగల ఐదు రోజులు పాటు కోస్తాంధ్ర లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. గురువారం నుంచి 40 నుంచి 60 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
-
యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు టెండర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఆరోగ్య సంరక్షణ విధానం మరింత బలోపేతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై – డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఒక కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీని రూపొందించి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీమా చేయుటకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి టెండర్లు ఆహ్వానానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది.
-
సీఎం, మంత్రులు సినిమాల్లో నటించవచ్చు: హైకోర్టు
ముఖ్యమంత్రితో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ సీఎం, సినీ నటుడు ఎన్టీ రామారావు విషయంలోనే అప్పట్లో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ IAS అధికారి విజయ్ కుమార్ పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట జ్యోతి ఈ మేరకు తీర్పునిచ్చారు.
-
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న హోం మంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 10) అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్ వ్యవస్థ ద్వారా తొలిసారిగా భద్రత ఏర్పాట్లను పరిశీలించార. ప్రజా సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 5వేల మంది పోలీసులతో సూపర్ 6 సూపర్ హిట్ సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15 నెలల్లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తిగా నియంత్రించామన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు త్వరలోనే చట్టం రాబోతోందని మంత్రి పేర్కొన్నారు.
-
కేటీఆర్‌పై నమోదైన 3కేసులు కొట్టివేత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన మూడు కేసులు కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుల మేరకు కేటీఆర్‌పై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు నకిరేకల్ పోలీసులు. వీటిని సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. మూడు పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్.. మూడు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ కక్షల కారణంగా కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది రమణ రావు వాదించారు.
-
భారత్ నుంచి నేపాల్ వెళ్లే పలు విమానాలు రద్దు
నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి రాజీనామాతో ముగిసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. దీంతో ఢిల్లీ నుంచి ఖాట్మండు మధ్య ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలను నిలిపివేశాయి. ఢిల్లీ-ఖాట్మండు-ఢిల్లీ మార్గంలో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపారు. అప్పటికే బయలుదేరిన ఇండిగో విమానాల దారిమళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఖాట్మండు వెళ్లాల్సిన విమానాలు లక్నోకు మళ్లించారు. నేపాల్ వెళ్లే భారత యాత్రికులకు అధికారులు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంలో హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు.
-
ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ అధికారి..!
హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీబీ చిక్కింది. మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక. ఇందులో భాగంగా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
-
గ్రూప్-1 మెయిన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు
గ్రూప్-1 మెయిన్స్‌పై సంచలన తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని.. ఆ తర్వాతే తిరిగి ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రీ వాల్యుయేషన్‌కు 8 నెలలు సమయం ఇచ్చింది. ఒక వేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే.. మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని TGPSCకి జస్టిస్ నామావరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఆదేశించింది.
-
పిడుగుపాటుకు కూలీ మృతి
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆకస్మాత్తుగా కురిసిన వర్షాలు ప్రజలను అతలాకుతంలం చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో ఓ కూలీ దుర్మరణం పాలైంది. పత్తి చేనులో పని చేసేందుకు వెళ్లిన గెల్ల పద్మ (45) అనే కూలీపై పిడుగుపాటు.. మృతి చెందారు. ఈదురు గాలుల కారణంగా అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపోవటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
-
వరదలతో దెబ్బతిన్న రాష్ట్రానికి రూ. 1500 కోట్లు సాయంః ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (సెప్టెంబర్ 9) హిమాచల్ ప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. విపత్తు ప్రభావిత మండి, కులు జిల్లాలను ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత కాంగ్రా చేరుకున్నారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన మేఘావృతాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్‌ను ప్రధాని మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌కు రూ. 1500 కోట్లు తక్షణ సాయం ప్రకటించారు ప్రధాని మోదీ. వరద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డవారికి రూ. 50 వేలు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.
-
నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. నేపాల్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. దీనికి ముందు ప్రధాని కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు, ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు మీడియా పేర్కొంది. ఓలీ రాజీనామా చేస్తే.. మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలోనే రాజీనామా ప్రకటన వెలువడింది.
-
చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్ శివారు చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాగ్దేవి కెమికల్స్ యాజమాని విజయ్, తానాజీని.. మహారాష్ట్రలోని థానే కోర్టులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హాజరుపరిచారు. దీంతో 12 మంది నిందితులకు 15రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు విజయ్, తానాజీ కస్టడీ కోసం పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. పదేళ్లుగా విజయ్ డ్రగ్స్ తయారీలో ఉన్నాడన్న పోలీసులు.. విజయ్ వెనుక ఇంకొందరు ఉన్నారని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. సీజ్ చేసిన కెమికల్స్‌ను కోర్టు ముందుంచారు. .
-
అర్థరాత్రి ఆసుపత్రికి రోహిత్ శర్మ.. అభిమానుల్లో టెన్షన్!
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు అర్థరాత్రి ఒక కీలక వార్త బయటకు వచ్చింది. రోహిత్ శర్మ సోమవారం(సెప్టెంబర్ 8) రాత్రి కోకిలాబెన్ ఆసుపత్రిలో కనిపించాడు. ఇది సోషల్ మీడియాలో అతని అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అసలు ఏమైందోనని తెలుసుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ ఆసుపత్రిలో చేరడానికి కారణం వెల్లడి కానప్పటికీ, క్రికెట్ అభిమానులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్ శర్మ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
-
క్లాసులోకి రాన్వలేదని స్టూడెంట్ ఘాతుకం..!
ఏలూరు జిల్లా నూజివీడు త్రిబుల్‌ఐటీలో ప్రొఫెసర్‌పై స్టూడెంట్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఏకంగా కత్తితో దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఐఐఐటీలో విద్యార్థులకు సెకండ్ సెమ్ పరీక్షలు జరుగుతున్నాయి. దీనికోసం విజయనగరానికి చెందిన పురుషోత్తం రావటంతో అక్కడ డ్యూటీలో ఉన్న సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజు అతడిని లోపలకి అనుమతించలేదు. ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రొఫెసర్‌పై దాడి చేశాడు పురుషోత్తం. ఈ ఘటనలో ఆయనకు పలు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే సహచర విద్యార్థులు అప్రమత్తమై పురుషోత్తంను పట్టుకుని అతడి వద్ద వున్న కత్తిని లాక్కున్నారు. గాయపడ్డ ప్రొఫెసర్‌ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు పాల్పడ్డ ఏం టెక్ (ట్రాన్స్‌పోర్ట్) స్టూడెంట్ మజ్జి వినాయక పురుషోత్తంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
-
AIతో అశ్లీల ఫొటోలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటి ఐశ్వర్య రాయ్
ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరారు. కొందరు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఉపయోగించుకుంటున్నారని, ఏఐతో అశ్లీల ఫొటోలను క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకరంగా వినియోగించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై విచారన జరిపిన కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
-
రేపు సూపర్ హిట్ పేరుతో.. కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ!
అనంతపురంలో ఈనెల 10వ తేదీన అంటే రేపు కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు కూటమి ఎమ్మెల్యేలందరూ ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారు. అనంతపురం శివారులో సూపర్ సిక్స్.. సూపర్ హిట్ బహిరంగ సభకు మూడు పార్టీలు భారీ ఏర్పాట్లు చేశాయి. గడచిన 15 నెలలుగా రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభ ద్వారా తెలియజేస్తామని ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అంటున్నారు.
-
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు 67% పోలింగ్ నమోదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటివరకు 67% పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 781లో ఇప్పటి వరకు 528 ఓట్లు పోలైనాయి. మిగిలిన ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటన్నారు.
-
కొనసాగుతున్న ఓటింగ్.. ఇవాళ్టి సాయంత్ర 6 గంటలకు ఓట్ల లెక్కింపు
ఇవాళ్టి సాయంత్రం ఐదు గంటల దాకా పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎంపీలకు ఎలక్షన్ అధికారులు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు పంపిణీ చేశారు. నో విప్ అమలులో ఉండటంతో ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం ప్రకారం ఓట్లేస్తున్నారు. నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకె, తదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకెలు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నుతోనే ఈ మార్కింగ్ చేయాలి.
-
ఉపరాష్ట్రపతి పోలింగ్‌కు దూరంగా మరో పార్టీ..
పార్లమెంట్ భవనంలో ఉపరాష్ట్రపతి పోలింగ్ కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా ఎంపీలు ఓటు వేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే బీజేడీ, బీఆర్‌ఎస్ ప్రకటించగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా శిరోమణి అకాలీదల్ కూడా ప్రకటించింది. పార్లమెంట్‌లో ఈ పార్టీ సంఖ్యా బలం మూడు. దీంతో మిగిలిన 769 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
-
జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా గెలవాలని కోరుకుంటున్నా: MLC కవిత
ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా గెలవాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థి కావడం తెలుగు వారికి, తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. సామాజిక తెలంగాణ కోసం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని, కవులు, కళాకారులు, మేధావులతో సమావేశాలు ఏర్పాటుచేస్తామన్నారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఇంకా మిగిలిపోయిన పనులకోసం జాగృతి పనిచేస్తుందని ఆమె అన్నారు.
-
నేపాల్‌లో టెన్షన్.. టెన్షన్.. ఆందోళనకారులపై లాఠీ చార్జి
నేపాల్‌లో తీవ్ర రాజకీయ అనిశ్చితి, అస్థిర వాతావరణం నెలకొంది. దీంతో ప్రధాని ఓలీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రధాని రాజీనామా కోరుతూ ఆందోళనకారుల నిరసనలు చేపట్టారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భద్రతాదళాలు ఆందోళనకారులపై బాష్పవాయుగోళాల ప్రయోగం, లాఠీచార్జి చేపట్టాయి.
-
ఎన్డీయే అభ్యర్ధి రాధాకృష్ణన్ విజయం కోసం ప్రత్యేక పూజలు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో ఉన్న ఎన్డీయే అభ్యర్ధి రాధాకృష్ణన్ విజయం సాధించాలని తమిళనాడులోని ఆయన స్వగ్రామంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
-
ఎన్డీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం ఖాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఎన్డీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈసారి బీసీ అభ్యర్థి విజయం ఖాయమన్నారాయన.
-
గ్రూప్ 1పై హైకోర్టు సంచలన తీర్పు.. జనరల్ ర్యాంకింగ్ రద్దు!
తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీ గ్రూప్ 1పై బుధవారం (సెప్టెంబర్ 9) కీలక తీర్పు వెలువరించింది. గతంలో వెలువరించిన జనరల్ ర్యాంకింగ్ ను రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలంటూ కమిషన్ ను ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ కుదరకపోతే మెయిన్స్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని అదేశించింది.
-
NDA Vs INDIA Bloc.. గెలుపెవరిది?
ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ (68).. తమిళనాడులోని గౌండర్-కొంగు వెల్లాలర్ వర్గానికి చెందిన నేత. రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా చేసిన సి.పి. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఇక ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (79) తెలంగాణకు చెందిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సల్వా జుడుం తీర్పు, బ్లాక్ మనీ దర్యాప్తులపై తన తీర్పులతో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి విశేష గుర్తింపు పొందారు.
-
ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్‌కి మద్దతుగా 36 మంది ఏపీ ఎంపీలు
2022 ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖర్ 528 ఓట్లతో (74.37%) గెలుపొందారు. ఈసారి సీపీ రాధాకృష్ణన్‌కు విజయావకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి సీపీ రాధాకృష్ణన్ కి 36 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. ఏపీతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలోని మెజారిటీ ఎంపీలు సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇస్తున్నారు. కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ,తెలంగాణ ఎంపీలు మద్దతునిస్తున్నారు.
-
ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతిస్తున్న పార్టీలు ఇవే..
ఇండియా కూటమి సంఖ్యాబలం లోక్ సభలో 234, రాజ్యసభలో 86. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్దవ్ థాకరే), ఎన్‌సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, జేఎంఎం, సీపీఐఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్,వీసీకే, భారత్ ఆదివాసీ పార్టీ, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, ఆర్‌ఎల్‌టీపీ, ఆర్‌ఎస్‌పీ, ఎంఎన్‌ఎం(కమల్ హాసన్) ఏజీఎం.. పార్టీలు మద్దతు తెలిపాయి.
-
ఉపారాష్ట్రపతి పోలింగ్ ప్రారంభం.. తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ
ఉపారాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ తొలి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. NDA అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్‌కు ఇప్పటి వరకు 436 మంది మద్దతు లభించింది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగే ఈ ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
-
ఎన్డీయే vs ఇండియా కూటమి.. గెలుపెవరిదో?
లోక్‌సభ 542, రాజ్యసభలో 239 సభ్యులు కలిసి మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391 దాటిన వారికి గెలుపు సొంతమవుతుంది. అధికార ఎన్డీయే కూటమికి ఇప్పటివరకు 422 సభ్యుల మద్ధతు లభించింది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయంమనే వినిపిస్తోంది.
-
మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక..
ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు ఈ పోటీలో తపపడుతున్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు ఎన్నిక జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఇదే రొజు రాత్రికి విజేతను ప్రకటిస్తారు.
-
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో EVM ఎందుకు వాడరో తెలుసా?
దేశ ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లు అత్యంత కీలకం. గత 2 దశాబ్ధాలుగా ఐదు లోక్‌సభ, 130 అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని ఉపయోగించారు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం వీటిని ఉపయోగించరు. ఇందుకు కారణం వాటిని ఓటు అగ్రిగేటర్లుగా రూపొందించడమే. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు దామాషా ప్రాతినిధ్య విధానం ప్రకారం జరుగుతాయి. సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటింగు పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ విధానం అనుసరిస్తారు.
-
ములుగులో కోతుల బెడద.. 19 నెలల బాలుడిపై కోతి దాడి
ములుగు జిల్లా తాడ్వాయిలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చుతుంది. కోతుల దాడులతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సహర్ష్ అనే 19 నెలల బాలుడిపై కోతి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ లో బాలుడు సహర్ష్ చికిత్స పొందుతున్నాడు. కోతి దాడి దృశ్యాలు CC కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కోతుల నుంచి రక్షణ కల్పించాలని తాడ్వాయి ప్రజలు అధికారులు కోరుతున్నారు.
-
మరికాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం.. ప్రధాని మోదీతో తొలి ఓటు
దేశ 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభమవనుంది. పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ మొదట ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
-
రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక.. అయినా మెజార్టీ ఎంపీల మద్దతు వారికే!
ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ సభ్యులకు విప్ జారీచేయకూడదని ఎన్నికలసంఘం స్పష్టం చేసింది. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం ఉంది. అయితే ఎన్డీయే మాత్రం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే ఇప్పటికే ఇండియా కూటమి బయట ఉన్న వేర్వేరు పార్టీల ఎంపీల మద్దతూ కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇరు కూటములు గత రెండ్రోజులుగా ఎంపీలందరినీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేస్తున్నాయి.
-
టీటీడీ ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్..
ఏపీలో ఏకంగా 11 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న శ్యామల్ రావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అనిల్ కుమార్ సింఘాల్ గతంలోనూ టీటీడీ ఈవోగా పనిచేసిన సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలోనే టీటీడీ ఈవోగా పనిచేసిన ఆయన ఆ తర్వాత బదిలీ అయ్యారు. ప్రస్తుత ఈవో శ్యామలరావును చంద్రబాబు నియమించారు.
-
అత్త హత్యకు కారణమైన అల్లుడికి జీవిత ఖైదు
విశాఖపట్నంలో అత్త హత్యకు కారణమైన నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం. నిందితుడు మహేష్ కు జీవిత ఖైదు తో పాటు 1.20లక్షల జరిమానా విధించింది. 2013 అక్టోబర్ 14న ఆరిలోవలో అల్లుడి మహేష్ దాడిలో అత్త ఎర్రంశెట్టి లక్ష్మి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
-
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 30 పొలిస్ యాక్ట్ అమలు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 30 పొలిస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా నిరసన ర్యాలీలు , సభలు , సమావేశాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
-
ఉపరాష్ట్రపతి ఎన్నికల లైవ్ అప్ డేట్స్ వీడియో..
ఉపరాష్ట్రపతి ఎన్నికల లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ వీక్షించండి.
-
ఉపరాష్ట్రపతి పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు.. రాత్రికి ఫలితాలు
ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో ఉన్న సి.పి.రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు నేడు షురూకానుంది. పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో పోలింగు జరుగుతుంది. పోలింగ్ ముగియగానే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు.
-
ఇచ్చాపురం పోస్టాఫీసు స్కామ్‌పై తేలని పేచీ..
ఇచ్చాపురం పోస్టాఫీసులో ఇంకా తేలని స్కాం సంగతులు. 39 ఖాతాల్లో రూ.2 కోట్ల 68 లక్షలు మాయం. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం దాచుకున్న డబ్బులు సమయానికి అందడం లేదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
కరకట్ట ఆశల పల్లకిలో మంచిర్యాల వాసులు
మంచిర్యాల జిల్లాలో ఏడాదికి ఏడాది ముంచెత్తుతున్న రాళ్ల వాగు. ఈ ఏడాది వరదల్లో దిశను మార్చుకున్న వాగు. పది కాలనీలకు పొంచి ఉన్న ముప్పు. వాగు కోతకు గురవడంతో ఆకస్మాత్తుగా కుంగిపోతున్న ఇండ్లు. మళ్లీ వర్షాలు ముంచెత్తితే ఇక అంతే సంగతులంటూ ముంపు వాసుల ఆందోళన.
-
యమపాశాల్లా.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు!
పంట పొలాల్లో రైతుల పాలిట ఉరితాళ్లవుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. అత్యంత ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి రైతులు, దుక్కిటెద్దుల మరణాలు సంభవిస్తున్నాయి.
-
ఉల్లి మాత్రమే కాదు.. టమాట ధరలు కూడా డమాల్!!
నిన్న మొన్నటి వరకు ఉల్లి ధరలు మాత్రమే పడిపోయాయి.. నేడు టమాట ధర కూడా నేల చూపులు చూస్తున్నాయి. పత్తికొండ మార్కెట్‌కు కుప్పలు తిప్పలుగా వస్తున్న టమాటలు. ప్యాపిలి మార్కెట్లో టమాట రైతులకు కమీషన్ల శాపం, మార్కెట్ మూసివేత. మార్కెట్లోనే టమాటలను పారబోస్తున్న రైతులు.
-
తెలంగాణలో తీరని యూరియా కష్టాలు
తెలంగాణలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. సొసైటీల వద్దే నిద్రిస్తున్న రైతులు. చెప్పులు, పాస్ బుక్లు క్యూలో పెట్టి గంటల తరబడి వెయిటింగ్. అయినా కొన్నిచోట్ల నిరాశే! మరోవైపు కొన్ని చోట్ల థంబ్ సమస్యలు తలెత్తుతున్నాయి
-
RRR డిజైన్‌పై కన్‌ఫ్యూజన్
RRR నిర్మాణంలో పెద్దలకు అనుకూలంగా డిజైన్లో మార్పులు చేశారా..? రైతుల ఆగ్రహానికి అదే కారణమా..?? హెచ్ఎండీఏ అధికారులు ఏమంటున్నారు..? ఇంతకీ RRR డిజైన్ ఎలా ఉండాలి..? ఎలా నిర్మిస్తున్నారు..?
-
వైసీపీ వర్సెస్ పోలీస్..! రచ్చరచ్చగా పాలిటిక్స్
గణేష్ నిమజ్జనం ర్యాలీలో రాజుకున్న వివాదం. పోలీసులను వైసీపీ కార్యకర్తలు కొట్టారంటూ కేసులు. దాడి చేశారంటూ ఖండించిన పోలీసు అధికారుల సంఘం. తమను కులం పేరుతో పోలీసులు దూషించారంటూ ఒంగోలు డీఎస్పీపై వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుతో రాజకీయ రచ్చ రాజుకుంది.
-
జైలు నుంచి వచ్చాక స్పీడ్ పెంచిన మాజీ మంత్రి కాకాని
నెల్లూరులో వన్ మ్యాన్ షో.! జైలు నుంచి బయటకు వచ్చాక మరింత స్పీడ్ పెంచిన మాజీ మంత్రి కాకాని. నియోజకవర్గం ఏదైనా నేనున్నానంటూ సీన్లోకి ఎంట్రీ ఇస్తున్న కాకాని.
-
ఈనెల 14న వైజాగ్‌లో భారీ బహిరంగ సభ.. జేపీ నడ్డా హాజరు
ముగిసిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సారధ్యం యాత్ర. 14న వైజాగ్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి జేపీ నడ్డా హాజరుకానున్నారు. సారధ్యం యాత్రతో మాధవ్ టార్గెట్ రీచ్ అయ్యారా..? అనుకున్నది సాధిస్తారా..? క్యాడర్లో నింపిన ఉత్తేజం పార్టీ బలోపేతానికి తోడ్పడుతుందా..?
-
మానేరు తీగల వంతెన చుట్టూ రాజకీయం
మానేరు తీగల వంతెన చుట్టూ రాజకీయం నెలకొంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు నిరుపయోగం. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు.
-
వైరా బీఆర్ఎస్ గందరగోళం.. ఇన్ఛార్జులెక్కడ సామీ?
ఇప్పటివరకూ అధిష్ఠానం ఇన్ఛార్జుల్ని నియమించలేదు. జిల్లా పార్టీ అనుమతి లేకుండా సొంతంగా ఎవరికి వారే మండల కమిటీల నియామకం. ఆ కమిటీలు చెల్లవంటూ రద్దు చేసిన జిల్లా అధ్యక్షుడు.
-
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో జర్మన్, జపనీస్ భాషల బోధన.. ఇఫ్లూతో ఒప్పందం
రాష్ట్రంలోనీ అన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో జర్మన్, జపనీస్ భాషలను బోధించేలా ప్రభుత్వ నిర్ణయం. ఇఫ్లూతో ఒప్పందం చేసుకోనున్న ప్రభుత్వం. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఒప్పంద కార్యక్రమం.
-
రేపే సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభ బుధవారం (సెప్టెంబర్ 10) జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. నేడు అనంతకు లోకేష్, సీనియర్ నేతలు.
-
జూబ్లీహిల్స్‌పై కన్ఫ్యూజన్‌లో కాంగ్రెస్.. అసలు సంగతేమంటే?
దానంతో రాజీనామా చేయించి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం. అనర్హత వేటు తప్పించేలా స్కెచ్. దానం అయితే జూబ్లీహిల్స్‌లో సరైన అభ్యర్థి అనే భావనలో నేతలు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొననున్న మంత్రులు. నేడు జడ్చర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓ ప్రైవేటు కార్యక్రమానికకి హాజరు కానున్నకేటీఆర్.
-
వాగ్దేవి ల్యాబ్ డ్రగ్స్ కేసులో తవ్వినకొద్ది తెరపైకి కొత్త అంశాలు..
వాగ్దేవి ల్యాబ్ డ్రగ్స్ కేసులో మరింత లోతుగా మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తు. మరోవైపు ముంబైలో తెలంగాణ ఈగల్ పోలీసుల ఆపరేషన్ చురుగ్గా సాగుతోంది. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి డ్రగ్స్‌పై దాడులు చేస్తుంటే ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారు.? లోకల్ పోలీసుల నిఘా ఏమైంది..? నార్కోటిక్ డ్రగ్స్కు, సింథటిక్ డ్రగ్స్‌కు తేడా ఏంటి .? ఏ డ్రగ్స్‌పై నార్కోటిక్ సబ్‌స్టాన్స్ అంటారు.? NDPS యాక్ట్‌లో రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి..?
తెలంగాణలో ఎన్ని ఫార్మా కంపెనీలు ఉన్నాయి.? వీటిలో ఎన్ని కెమికల్ ఫ్యాక్టరీలు..!! కెమికల్ ఫ్యాక్టరీల ముసుగులో డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీలు ఎన్ని..? వాటిని ఎక్కడికి సరఫరా చేస్తున్నారు..? మూతపడ్డ ఫార్మా కంపెనీలే డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారుతున్నాయా?
-
పైలా దిలీప్ బెయిల్ రద్దు చేయలని ఏపీ హై కోర్టులో సిట్ పిటిషన్
లిక్కర్ స్కాం కేసులో పైలా దిలీప్ బెయిల్ రద్దు చేయలని ఏపీ హై కోర్టులో సిట్ పిటిషన్. పైలా దిలీప్‌కు విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు హై కోర్టును ఆశ్రయించిన సిట్. గత నెల 28న పైలా దిలీప్ కు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు. లిక్కర్ స్కాం కేసులో నిధితుల నేరారోపణలపై ఎసీబీ కోర్టు తమ వాదనలను పరిగణలోకి తీసుకోలేదని హై కోర్టును ఆశ్రయించిన సిట్.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్ పై విడుదలయ్యారు. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు. ఈనెల 11 వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కానున్న మిథున్ రెడ్డి.
-
నిన్న తాబేళ్ల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు.. నేటి తెల్లవారుజామున మృతదేహం లభ్యం
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్మలాపురం- నల్లెల్ల గ్రామ శివారులోని గణేష్ కుంటలో తాబేళ్ల కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి మృత దేహం లభ్యమైంది. నిన్న సాయంత్రం తాబేళ్ల కోసం వేటకు వెళ్లిన వెంకన్న (50) కోసం నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున మృతదేహం లభ్యమైంది.
-
కాళేశ్వరం వద్ద నిలకడగా వరద ప్రవాహం.. నేడు 85 గేట్లు ఓపెన్
కాళేశ్వరం వద్ద గోదావరి కి నిలకడగా కొనసాగుతున్న వరద ప్రవాహం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో 2,50,120 క్యూసెక్స్. పూర్తి స్థాయిలో 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు.
-
నేడు యూరియా కోసం వైసీపీ నిరసనలు.. అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు
నేడు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరుకు పిలుపు. యూరియా దొరక్క అవస్థలు పడుతున్న వైనంపై వైసీపీ నిరసన చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లి, ఆర్డీఓలకు వినతిపత్రం ఇవ్వనున్న వైసీపీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వ్యవసాయ రంగంలో సంక్షోభం, విత్తనాల కొరత, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని వైసిపి ఆరోపణలు చేసింది. మరోవైపు సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని తేల్చి పోలీసులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన జిల్లా ఎస్పీలు.
-
AP Weather Update: వచ్చే 3 గంటల్లో శ్రీకాకుళంలో ఉరుములు మెరుపులతో వాన
శ్రీకాకుళం జిల్లాలో రాబోయే 3 గంటల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
-
రంగు మారిన అంతర్వేది సముద్రం.. వెలవెల బోతున్న అంతర్వేది బీచ్
అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి (మం)లో రంగు మారిన అంతర్వేది సముద్రం. దీంతో నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే అంతర్వేది బీచ్ వెల వెల బోతుంది. ఎపుడూ స్వచ్చంగా ఉండే సముద్రం నీరు రంగుమారి, చెడు వ్యర్థాలతో నిండిపోయింది. బీచ్ ప్రదేశం అశుభ్రంగా ఉండడంతో సుధూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు, పర్యాటకులు స్నానం చేయకుండానే నిరాశతో వెనుతిరిగి వెళుతున్నారు. బీచ్‌లో ఎన్నిసార్లు శుభ్రం చేసినా మరల మరల వ్యర్ధాలు కొట్టుకు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు.
దీనిపై కలెక్టర్ స్పందించి బీచ్‌ని శుభ్రం చేసే ప్రక్రియ చేపట్టాలని అంతర్వేది పంచాయతీ సర్పంచి జాన్ బాబు కోరుతున్నారు. ముంబై లో కురుస్తున్న భారీ వర్షాల నీరు.. నదుల ద్వారా కలుషిత వ్యర్ధాలతో సముద్రంలో కలవడంతో స్వచ్ఛంగా నీలిరంగులో ఉండే సముద్రపు నీరు మట్టి రంగులోకి మారిందని స్థానికులు అంటున్నారు.
-
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్
లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఏ30 పైలా దిలీప్, ఏ1 ధనుంజయ రెడ్డి, ఏ32కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప, బెయిల్ పై విడుదల. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు. ఈనెల 11 వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కానున్న మిథున్ రెడ్డి.
-
లిక్కర్ స్కాం కేసులో ముగిసిన నిందితుల రిమాండ్.. నేడు ఏసీబీ కోర్టులో హాజరు
లిక్కర్ స్కాం కేసులో నేటితో ముగిసిన నిందితుల రిమాండ్. నేడు విజయవాడ జిల్లా జైలు, గుంటూరు జిల్లా జైలులో ఉన్న నిందితులను కోర్టులో హాజరు పరచనున్న సిట్ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో 12 మందిని అరెస్టు వారిలో నలుగురికి బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు. తాజాగా లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ పై విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. నేడు ఏసీబీ కోర్టులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 గురినీ కోర్టులో హాజరు పరచనున్న సిట్ అధికారులు.
-
YCP Protests over Urea shortage: యూరియా కొరతపై వైసీపీ నిరసనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతపై వైసీపీ నిరసనలు చేపట్టింది. మరో వైపు కేంద్రం నుంచి భారీగా యూరియా రాబోతున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. తురకపాలెం వరుస మరణాలపై వీడని మిస్టరీ. నేడు ఐసీఎంఆర్ బృందం పర్యటించనుంది. కర్నూలు మార్కెట్కు రికార్డు స్థాయిలో తరలివచ్చిన ఉల్లి. మార్కెట్ బయట బారులు తీరి నిలిచిపోయిన ఉల్లి ట్రాక్టర్లు. తమను ఆదుకోవాలంటూ అధికారులకు వేడుకోలు.
-
Telangana High Court: టీజీపీఎస్సీ గ్రూప్ 1పై నేడు హైకోర్టులో కీలక తీర్పు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు, మూల్యాంకనం తదితర అంశాలపై పిటిషన్‌లు దాఖలయ్యాయి. మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహించాలని 20 మంది అభ్యర్థులు కోరారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాగా.. జూలై 7న వాదనలు ముగిశాయి. హై కోర్టు తీర్పు పై గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
-
సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసిన నేపాల్ సర్కార్
భారీ నిరసనల నేపథ్యంలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలో 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో దిగొచ్చిన కెపి శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం సోమవారం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత.. హోంమంత్రి రాజీనామా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
-
జూరాల ప్రాజెక్ట్‌కు తగ్గుతున్న వరద, గేట్ల మూసివేత
మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్ట్‌కు తగ్గుతున్న వరద, గేట్ల మూసివేత. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఇన్ ఫ్లో : 26,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 46,866 క్యూసెక్కులు. పూర్తి స్దాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుతం 317.940 మీటర్ల మేర నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 8.493 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
-
నేడు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
ఢిల్లీకి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేడు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ ని కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులు కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో భారీగా రైతులు పంట నష్టపోయారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రిని కలిసి రూ.5000 కోట్ల ప్రాధమిక సాయం విడుదల చేయాలని కోరిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
-
నేటి నుంచి ఆసియా కప్ టి20 ప్రారంభం.. సెప్టెంబర్ 14న భారత్-పాక్ మ్యాచ్
నేటి నుంచి ఆసియా కప్ టి20 ప్రారంభంకానుంది. మొదటి మ్యాచ్ అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ జరగనుంది. ఇండియా మొదటి మ్యాచ్ ను బుధవారం యూఏఈతో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. తొలిసారిగా 8 జట్లు ఆసియా కప్‌లో పాల్గొంటున్నాయి. ఈ నెల 14న భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుంది.
గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్. గ్రూప్ ‘బి’: అఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్.
-
ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు
తెలంగాణలోని బీఆర్ఎస్ కి రాజ్యసభలో నాలుగు స్థానాలు ఉన్నాయి. బీజేడీకి రాజ్యసభలో 7 సభ్యులు. ఈ రెండు పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నట్లు ప్రకటించాయి.
-
ఉభయసభల్లో 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు..
లోకసభలోని 543 మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం 1 స్థానం ఖాళీగా ఉంది. ఇక రాజ్యసభలోని 233 మంది సభ్యులు ఉండగా.. ఇందులో ప్రస్తుతం 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు ఓటర్లు. ఈ మొత్తం సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే, 392 ఓట్లు వచ్చిన అభ్యర్థిదే గెలుపు. చెల్లుబాటైన ఓట్లు లో సగాని కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్ధిదే గెలుపు.
-
ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు వీరే..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి.. సయ్యద్ నసీర్ హుస్సేన్, మాణికం ఠాగూర్, శతాబ్ది రాయ్ పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లుగా శక్తి సింగ్ గోహిల్, మాణికం ఠాగూర్ వ్యవహరించనున్నారు.
-
పోలింగ్.. ఫలితాలు.. రెండూ ఒకే రోజు! సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న సి. పి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్త పార్లమెంట్ భవనంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జరగనుంది.
-
కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి పోలింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నిక 2025 ఓటింగ్ ఈరోజు కొత్త పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
-
Vice president elections news update: ఢిల్లీకి సీఎం రేవంత్, మంత్రి నారా లోకేష్..
ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పర్యవేక్షణతో పాటు, కేంద్ర మంత్రులతో భేటి (ప్రభాకర్, గోపి) అయ్యే అవకాశం ఉంది. అటు ఏపీ మంత్రి లోకేష్ కూడా ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఎంపీలతో మంత్రాంగం. కేంద్రం మంత్రులతో భేటి.
-
ఉప రాష్ట్రపతి ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు..
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ఉంటుంది. మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781, ఇందులో లోక్‌సభ నుంచి 542, రాజ్యసభ నుంచి 239 ఓట్లు ఉన్నాయి. మెజార్టీ మార్క్ 391. ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు ఉన్నాయి.
-
Gold Rates Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు చూశారా..?
నేడు సెప్టెంబర్ 09 మంగళ వారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 108,370 గా ఉంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,340 గా ఉంది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 108,380 ఉండగా, నేడు (సెప్టెంబర్ 9) రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.108,370గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం రూ.99,350 ఉండగా.. నేడు (మంగళ వారం) రూ.10 తగ్గడంతో 99,340గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.108,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,340 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.108,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,340వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
-
AP weather Update: నేడు ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు పడే ఛాన్స్!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు భారీ వర్షం పడనుంది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది.
-
Telangana weather Update: తెలంగాణలో పలు ప్రాంతాల్లో నేడు మోస్తారు వర్షాలు..
తూర్పు దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి. దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో సముద్రమత్తానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం.. ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. రేపు తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
-
ఏపీ నుంచి సీపీ రాధాకృష్ణన్‌కి 36 మంది MPల మద్దతు
ఎన్డీఏకు లోక్‌సభలో 293, రాజ్యసభలో 129 సభ్యులు ఉన్నారు. ఉభయసభల్లో ఎన్డీఏ సంఖ్యా బలం మొత్తం 422. ఎన్డీఏకు అవసరమైన మెజారిటీ కంటే 28 ఓట్లు ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి సీపీ రాధాకృష్ణన్ కి మద్దతు ఇస్తున్న 36 మంది ఎంపీలు
-
PM Modi to visit flood hit states: నేడు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రధాని మోదీ పర్యటన
వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం అవుతున్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లను మంగళవారం (సెప్టెంబర్ 9) ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
-
నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
Published On - Sep 09,2025 6:24 AM
