AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vice President Election 2025 LIVE: ప్రధాని మోదీ తొలి ఓటు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష ప్రసారం..

Vice President Election 2025 LIVE: ప్రధాని మోదీ తొలి ఓటు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రత్యక్ష ప్రసారం..

Shaik Madar Saheb
|

Updated on: Sep 09, 2025 | 10:11 AM

Share

పెద్దల సభకు పెద్ద ఎవరుకాబోతున్నారు. దేశంలో రెండో పౌరుడి బాధ్యత ఎవరి చేతిలో పెట్టబోతోంది పార్లమెంట్‌? ఈరోజు జరగనున్న ఓటింగ్‌లో విజేత ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనిఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారి ఎన్నిక జరుగుతోంది. 101 వసుధ హాల్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరుగుతోంది.

పెద్దల సభకు పెద్ద ఎవరుకాబోతున్నారు. దేశంలో రెండో పౌరుడి బాధ్యత ఎవరి చేతిలో పెట్టబోతోంది పార్లమెంట్‌? ఈరోజు జరగనున్న ఓటింగ్‌లో విజేత ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొనిఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభమైంది. కొత్త పార్లమెంట్‌ భవనంలో తొలిసారి ఎన్నిక జరుగుతోంది. 101 వసుధ హాల్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ జరగనుంది. సాయంత్రం ఆరుగంటలకు కౌంటింగ్ .. ఆ తర్వాత గెలిచిన అభ్యర్థిని ప్రకటించనున్నారు.

కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు.. ఎన్డీఏ అభ్యర్ధిగా రాధాకృష్ణన్‌, ఇండి కూటమి అభ్యర్ధిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. విజయానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 386 ఓట్లు.. సీపీ రాధాకృష్ణన్‌కే ఎక్కువమంది ఎంపీల మద్దతు ఉంది. దీంతో ఆయన గెలిచే అవకాశం ఉంది. ఉభయ సభల్లో ఈరోజు 770 మంది ఎంపీలు ఓటు వేయబోతున్నారు. ఇందులో 542 మంది లోక్‌సభ ఎంపీలు , 228 మంది రాజ్యసభ ఎంపీలున్నారు.

Published on: Sep 09, 2025 09:50 AM