Hyderabad: వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని వాహనదారులకు అలర్ట్.. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ముందస్తుగా గమనించి వెళ్లే మార్గాలలో ఉండే ట్రాఫిక్ ఆంక్షలను గమనించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ..
హైదరాబాద్‌లోని వాహనదారులకు అలర్ట్.. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ముందస్తుగా గమనించి వెళ్లే మార్గాలలో ఉండే ట్రాఫిక్ ఆంక్షలను గమనించుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఐమాక్స్, నెక్లెస్ రోడ్, ట్యాంక్బండ్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు. అలాగే నెక్లెస్రోడ్, సెక్రటేరియట్, ఐమాక్స్ ప్రాంతాల్లోని హోటళ్ల సైతం మూసివేశారు అధికారులు. ఈ ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. అయితే బౌద్ద గురువుల మధ్య ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరానున్న వేలాది మంది ప్రజల సమక్షంలో హుస్సేన్ సాగర్ చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో విగ్రహావిష్కరణ సందర్భంగా పూలవర్షం కురిపిస్తారు. విగ్రహావిష్కరణలో భాగంగా భారీ క్రేన్‌తో విగ్రహానికి ఉన్న తెరను తొలగించి గులాబీలు, తెల్లటి పుష్పగుచ్ఛాలు, తమలపాకులతో చేసిన భారీ దండతో మాల వేయనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి