Indian Railways: ట్రైన్‌ హరన్‌లో ఇన్ని అర్థాలు ఉంటాయా..? ఎన్నో ఆసక్తికర విషయాలు

దేశ వ్యాప్తంగా అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది ఇండియన్‌ రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు రైల్లో లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే రైలు ప్రయాణం సాఫిగా సాగిపోతుంటుంది..

Indian Railways: ట్రైన్‌ హరన్‌లో ఇన్ని అర్థాలు ఉంటాయా..? ఎన్నో ఆసక్తికర విషయాలు
Indian Railways
Follow us

|

Updated on: Apr 11, 2023 | 5:41 PM

దేశ వ్యాప్తంగా అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది ఇండియన్‌ రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు రైల్లో లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే రైలు ప్రయాణం సాఫిగా సాగిపోతుంటుంది. టికెట్‌ ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యులు కూడా ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాగే భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సదుపాయాలను ఏర్పాటు చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లు నడపడం, మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతూనే ఉంటుంది. ఇక చాలా మంది రైళ్లో ప్రయాణించినా కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. మన చుట్టు జరిగేవి వాటిలో అర్థాలు చాలానే ఉంటాయి. కానీ మనం వాటిని గమనించం. అలాంటిదే ఇప్పుడు మీకు చెప్పబోయేది. మనకు తరచుగా రైల్వే స్టేషన్లో వినిపించేది రైలు హరన్. స్టేష‌న్‌కు చేరేముందు కానీ, క్రాసింగ్‌ల వ‌ద్ద కానీ రైలు డ్రైవ‌ర్ హ‌ర‌న్ మోగిస్తుంటాడు. అన్ని రైళ్ల హరన్లు ఒకేలా వినిపించినా.. వాటిలో చాలానే అర్థాలు ఉంటాయి. మ‌రీ రైలు ఇచ్చే హ‌ర‌న్‌లో అర్థాలేంటో చూద్దాం.

  1. స్టేషన్‌లో ఉన్న రైలు ఒక చిన్నహరన్ ఇచ్చిందంటే రైలు స్టేషన్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అర్థం.
  2. ట్రైన్ కిచెన్ లో ఉన్న మోటార్ మ్యాన్ గార్డుకు సిగ్నల్ ఇవ్వడానికి ఒక‌ షాట్ హరన్ ఇస్తాడు. దీంతో గార్డు అంత చెక్ చేసి ట్రైన్ కదలడానికి సిగ్నల్ ఇస్తాడు.
  3. ఇక మూడు సార్లు షాట్ హరన్ ఇచ్చాడంటే అది మోటారు మ్యాన్ అదుపు తప్పిందని అర్థం. దీంతో వార్డు వ్యాక్యుమ్ బ్రేక్ ను లాగుతాడు. దాంతో ట్రైన్ ఆగిపోతుంది.
  4. నాలుగుసార్లు షాట్ హరన్ ఇచ్చాడంటే ట్రైన్ లో ఏదో సాంకేతిక లోపం ఉందని, ట్రైన్ స్టేష‌న్ నుంచి వెళ్లదని తెలుపడానికి ఈ సిగ్నల్ ఇస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇక రెండు లాంగ్ హరన్‌లు, రెండు షాట్ హరన్‌లు ఇచ్చాడంటే ఆ ట్రైన్‌ను మోటార్ మ్యాన్ కంట్రోల్ నుంచి గార్డు కంట్రోల్ లోకి తీసుకుంటున్నట్లు అర్థం.
  7. ఒక వేళ వరుసగా హరన్ మోగుతుంటే ఆస్టేషన్‌లో రైలు ఆగదని అర్థం.
  8. అలాగే రైలు రెండు సార్లు ఆగి, రెండుసార్లు హరన్ మోగిస్తే అది రైల్వే క్రాసింగ్ దాటుతుందని అర్థం.
  9. రెండు షాట్ హరన్, ఒక లాంగ్ హరన్ మోగిస్తే ఎవరో చైన్ లాగాడని అర్థం. రైలుకు ఏదైన ప్రమాదం వస్తే ఆరు సార్లు షాట్ హరన్స్ మోగిస్తారు. ఇలా రైలు హ‌ర‌న్ మోగించ‌డంలో అన్ని అర్థాలు ఉన్నాయని గుర్తించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి