- Telugu News Photo Gallery Technology photos Here are the best smartphones under rs 12,000, check specs, features and more
Smartphones Under 12,000: అదిరే ఫీచర్లు.. ఆకట్టుకునే ఆప్షన్లు.. అందుబాటు ధరలోనే అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు..
పిండికొద్దీ రొట్టె అంటుంటారు పెద్దలు.. నిజమే ఎంత ఎక్కువ డబ్బులుంటే అంత ఎక్కువ సౌక్యం.. ముఖ్యంగా ఫోన్ల విషయంలో ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. ధర ఎక్కువైన కొలదీ దానిలో ఫీచర్లు పెరుగుతుంటాయి. ర్యామ్ సైజ్, స్టోరేజీ, కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, ఓవరాల్ గా ఫోన్ పనితీరు వంటివి అన్నీ కూడా ఫోన్ ధర మీద ఆధారపడి ఉంటాయి. అయితే కొన్ని స్మార్ట్ ఫోన్లు మాత్రం తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు రూ. 12,000 వరకూ ధర వెచ్చించగలిగితే అదిరిపోయే ఫీచర్లు, ఆప్షన్లతో పలు ఫోన్లు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వాటిల్లో బెస్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. అవేంటో ఓసారి లుక్కేయండి..
Madhu | Edited By: seoteam.veegam
Updated on: Apr 11, 2023 | 6:00 PM

రియల్‌మీ సీ55(Realme C55).. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11,999గా ఉంది. ఇది 6.72 అంగుళా డిస్ ప్లే ఉంటుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.64ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెకండరీ కెమెరాతో పాటు ముందు వైపు 8ఎంపీ సెల్పీ కెమెరా ఉంది. దీనిలోని బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. అలాగే హీలియో జీ88 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్13(Samsung Galaxy F13)..ఎక్సినోస్ 850 చిప్ ఆధారంగా ఇది పనిచేస్తోంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో కూడిన ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్ పై కేవలం రూ. 10,999కే లభిస్తోంది. 6.6 అంగుళాల డిస్ ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50ఎంపీ కాగా మిగిలిన రెండు 8ఎంపీ, 2ఎంపీ, ముందు వైపు 16ఎంపీ సెల్పీ కెమెరా ఉంటుంది.

మోటోరోలా జీ32(Motorola G32).. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్‌లో రూ. 11,999గా ఉంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు వెనుకవైపు ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ సెట్ తో పనిచేస్తుంది. దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.

ఒప్పో ఏ17(Oppo A17).. 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీ సామర్థ్యంతో నడిచే దీని ధర రూ. 11,950గా ఉంది. ఇది మీడియాటెక్ హీలియో జీ35 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6.5 అంగుళాల డిస్ ప్లే, వెనుకవైపు డబుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13).. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ సామర్థ్యంతో కూడిన ఈ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 11,489 గా ఉంది. దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో 6.6 అంగులళాల డిస్ ప్లే ఉంటుంది. 6000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ వస్తోంది.





























