AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో టాప్-5 భారీ విజయాలు.. ముంబై ఇండియన్స్ రికార్డును ఎవరైనా బద్దలు కొడతారా?

IPL 2026 : ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్ చరిత్రలో పరుగుల పరంగా భారీ విజయాలు సాధించిన టాప్ జట్ల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ రికార్డులను ఈ సీజన్లో ఏ జట్లైనా బద్దలు కొడతాయేమో చూడాలి.

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో టాప్-5 భారీ విజయాలు.. ముంబై ఇండియన్స్ రికార్డును ఎవరైనా బద్దలు కొడతారా?
Mumbai Indians
Rakesh
|

Updated on: Mar 21, 2026 | 8:02 AM

Share

IPL 2026 : క్రికెట్ పండుగ ఐపీఎల్ 2026 (IPL 2026) కౌంట్ డౌన్ షురూ అయిపోయింది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్‌లో తొలి పోరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. కొత్త సీజన్ వస్తోందంటే చాలు.. పాత రికార్డుల దుమ్ము దులిపి మరీ ఫ్యాన్స్ చర్చించుకుంటారు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో ప్రత్యర్థి జట్లను ఊపిరి సలపనీయకుండా కొట్టి, భారీ పరుగుల తేడాతో విజయం సాధించిన టాప్ జట్ల రికార్డులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ముంబై ఇండియన్స్ – 146 పరుగుల చారిత్రక విజయం

ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా అత్యంత భారీ విజయం సాధించిన రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉంది. 2017, మే 6న ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను ముంబై ఏకంగా 146 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 212 పరుగులు చేయగా.. ఢిల్లీ టీమ్ కేవలం 66 పరుగులకే కుప్పకూలిపోయింది. 13.4 ఓవర్లలోనే ఢిల్లీ పని అయిపోయింది. ఇప్పటికీ ఈ రికార్డు పదిలంగానే ఉంది.

ఆర్సీబీ వీరవిహారం – 144 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపు

ఈ జాబితాలో రెండో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. 2016, మే 14న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ లయన్స్ జట్టును ఆర్సీబీ 144 పరుగుల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సెంచరీల వర్షం కురిపించడంతో ఆర్సీబీ 248 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ కేవలం 104 పరుగులకే చాపచుట్టేసింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని మ్యాచుల్లో ఇది ఒకటి.

కేకేఆర్ క్లాసిక్ విక్టరీ – 140 పరుగుల తేడాతో ఆర్సీబీపై విజయం

ఐపీఎల్ చరిత్రలోనే తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. 2008, ఏప్రిల్ 18న బెంగళూరుతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో బ్రెండన్ మెకల్లమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో కేకేఆర్ 222 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో ఆర్సీబీ టీమ్ కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 140 పరుగుల భారీ తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఐపీఎల్ లీగ్ మీద ప్రపంచానికి నమ్మకం కలిగించిన మ్యాచ్ ఇదే.

ఆర్సీబీ జోరు – 138,130 పరుగుల భారీ గెలుపులు

భారీ విజయాల జాబితాలో నాలుగో, ఐదో స్థానాల్లో కూడా ఆర్సీబీనే ఉంది. 2015లో పంజాబ్ కింగ్స్‌పై 138 పరుగుల తేడాతో.. అలాగే 2013లో పూణే వారియర్స్‌పై 130 పరుగుల తేడాతో బెంగళూరు ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా పూణేతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 175 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ చేసిన 263 పరుగులు ఇప్పటికీ ఒక సంచలనం. ఇలా భారీ పరుగుల తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించడంలో ఆర్సీబీది ఒక ప్రత్యేకమైన శైలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us