Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO Alert: ఈపీఎఫ్‌ సభ్యులకు అలర్ట్‌.. ఈ కొత్త రకం మోసం గురించి తప్పక తెలుసుకోండి

దేశంలో ఆన్‌లైన్ స్కామ్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ముంబైకి చెందిన జిమ్ హానర్ రూ.1.99 లక్షలు కోల్పోయారు. అదే సమయంలో 53 ఏళ్ల మహిళ ఫుడ్ ఆర్డర్ చేస్తూ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.87,000 పోగొట్టుకున్నారు. ఇది కాకుండా..

EPFO Alert: ఈపీఎఫ్‌ సభ్యులకు అలర్ట్‌.. ఈ కొత్త రకం మోసం గురించి తప్పక తెలుసుకోండి
Online Scam
Follow us
Subhash Goud

|

Updated on: Apr 11, 2023 | 3:58 PM

దేశంలో ఆన్‌లైన్ స్కామ్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ముంబైకి చెందిన జిమ్ హానర్ రూ.1.99 లక్షలు కోల్పోయారు. అదే సమయంలో 53 ఏళ్ల మహిళ ఫుడ్ ఆర్డర్ చేస్తూ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.87,000 పోగొట్టుకున్నారు. ఇది కాకుండా, ఓఎల్‌ఎక్స్ యాప్‌లో జ్యూసర్‌ను విక్రయిస్తున్నప్పుడు వినియోగదారుడు రూ.1.14 లక్షలను మోసగించారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త ట్రిక్స్‌ని అవలంబిస్తున్నారని తెలిపేందుకు కొన్ని ఉదాహరణలు ఇవి.

ఈ క్రమంలో కొత్త తరహా మోసం తెరపైకి వచ్చింది. ఓ టీచర్ పీఎఫ్ ఖాతా నుంచి 80 వేల రూపాయలను మోసగాడు నొక్కేశాడు. మీరు కూడా పీఎఫ్‌ అకౌంట్‌ కలిగి ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వీరి లాగే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది.

మహిళా టీచర్‌ని ఇలా టార్గెట్ చేశారు..

TOI నివేదిక ప్రకారం.. నవీ ముంబైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 32 ఏళ్ల మహిళా టీచర్‌గా పని చేస్తోంది. మహిళా టీచర్ ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ ఆఫీసు కాంటాక్ట్ నంబర్ కోసం వెతుకుతోంది. అందులో దొరికిన నంబర్‌ను సంప్రదించారు. ఫోన్ కాల్ లో మాట్లాడిన సదరు వ్యక్తి AirDroid యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని ఖాతాదారునికి కోరాడు. తాను పీఎఫ్ పీఎఫ్ కార్యాలయ సిబ్బందిగా చెప్పుకున్నాడు. ఇంకేముంది ఆమె పీఎఫ్‌ ఖాతా వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమె ఖాతాలోంచి రూ.80 వేలు డెబిట్‌ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం, మోసగాడు మహిళా ఉపాధ్యాయిని ఈ యాప్‌లో ఆమె ఖాతా నంబర్, MPIN నమోదు చేయమని కోరాడు. బ్యాంకుకు యాక్సెస్ పొందిన తర్వాత, స్కామర్ 16 లావాదేవీలు చేసి రూ.80,000 అతని ఖాతాకు బదిలీ చేశాడు. ఈ ఘటన గత వారం రోజులుగా మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. తాను మోసపోయినట్లు భావించిన బాధితురాలు ఏప్రిల్ 6న సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మీరు జాగ్రత్తగా ఉండాలి

మీరు ఏదైనా నంబర్ గురించి సమాచారాన్ని పొందాలనుకుంటే అధికారికంగా ఉన్న ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే చూడాలి. అధికారిక వెబ్‌సైట్‌ కాకుండా ఇతర సైట్లలో వెతికినట్లయితే మోసపోయే అవకాశం ఉంది. థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌లో నంబర్లు, ఇతర వివరాలు ఎట్టి పరిస్థితుల్లో వెతకకూడదు. మరోవైపు పీఎఫ్‌ ఖాతాదారులు పీఎఫ్‌కు సంబంధించిన ఏదైనా పని కోసం EPFO అధికారిక వెబ్‌సైట్ లేదా శాఖను సందర్శించవచ్చు. ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు, దాన్ని వెరిఫై చేయండి.

మీరు ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఇతర పత్రాన్ని ఉపయోగిస్తుంటే, ఆ ప్లాట్‌ఫారమ్ ప్రామాణికతను తనిఖీ చేయండి. అలాగే, ఆహారం, ఉద్యోగాల కోసం, ఇతర వస్తువులు ఏవైనా కొనుగోలు చేయాలంటే అన్ని వివరాలు తనిఖీ చేయాలి. లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి