AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Insurance: టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రయాణ బీమాను మర్చిపోవద్దు.. ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

ఏదైనా యాక్సిడెంట్ జరగడం, మీ వస్తువులను పోగోట్టుకోవడం, మీ ప్రయాణిస్తున్న విమానం, రైళ్లు వంటివి రద్దవడం వంటివి జరిగినప్పుడు మీకు బాగా ఉపయోగపడేది ట్రావెల్ ఇన్సురెన్స్(ప్రయాణ బీమా). దేశంలో ప్రయాణాలు చేసినా లేక అంతర్జాతీయంగా టూర్లకు వెళ్లినా ఇది మీకు సాయపడుతుంది.

Travel Insurance: టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రయాణ బీమాను మర్చిపోవద్దు.. ఎన్ని ప్రయోజనాలు తెలుసా?
Travel Insurance
Madhu
|

Updated on: Apr 11, 2023 | 2:54 PM

Share

ప్రయాణాలు మన జీవితంలో భాగం. వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అవసరం ఏదైనా ప్రయాణాలు చేయడం తప్పదు. ప్రయాణం మొత్తం సాఫీగా సాగితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు ఏదైనా యాక్సిడెంట్ జరగడం, మీ వస్తువులను పోగోట్టుకోవడం, మీ ప్రయాణిస్తున్న విమానం, రైళ్లు వంటివి రద్దవడం వంటివి జరిగినప్పుడు మీకు బాగా ఉపయోగపడేది ట్రావెల్ ఇన్సురెన్స్(ప్రయాణ బీమా). దేశంలో ప్రయాణాలు చేసినా లేక అంతర్జాతీయంగా టూర్లకు వెళ్లినా ఇది మీకు సాయపడుతుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రయాణ బీమా అంటే ఏమిటి? దానిలోని రకాలేంటి? ఎటువంటి కవరేజ్ ను ఎంపిక చేసుకోవాలి? దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం రండి..

ప్రయాణ బీమా అంటే..

ప్రయాణ సమయంలో ఆర్థిక భద్రత, భరోసా కల్పించడమే ప్రయాణ బీమా ప్రధాన ఉద్దేశం. ఇందులో చాలా రకాల పాలసీలు అందుబాటులో ఉన్నా.. మీ అవసరాలను బట్టి వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీ, డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీ, వ్యక్తిగత ప్రయాణ బీమా, ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీ, సీనియర్ సిటిజన్ ట్రావెల్ పాలసీ, స్టూడెంట్ ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీ, ట్రావెల్ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ, సింగిల్, మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సురెన్స్ పాలసీ వంటి అనేక రకాల ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మీకు అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు.

రెండు రకాలుగా కవరేజీ..

ట్రావెల్ ఇన్సురెన్స్ ప్రధానంగా రెండు రకాల కవరేజీ ఉంటుంది. మొదటిది వైద్య పరమైన అవసరాలను తీర్చే బీమా.. ఇది అత్యవసర సమయంలో మీ వైద్యానికి సంబంధించిన అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇది దేశీయంగా లేదా అంతర్జాతీయంగానైనా ఎక్కడైన ఉపయోగపడుతుంది. రెండోది ఆర్థిక పరమైన నష్టాలను భర్తీ చేసే బీమా.. ప్రయాణంలో వ్యక్తిగత వస్తువులు కోల్పోవచ్చు లేదా సామాను పోవచ్చు. మీ పాస్‌పోర్ట్ నష్టపోవచ్చు. ఇలాంటి వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

సరైన బీమా ఎంచుకోవడం ఎలా..

మీరు వెళ్లే గమ్యస్థానాన్ని బట్టి మీ ప్రయాణ బీమాను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని రోజులు అక్కడ ఉంటారు అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు యూరప్ లోని రెండు దేశాలలో సాధారణ ప్రయాణం అనుకుందాం. మీకు అప్పుడు ప్రాథమిక ప్రయోజనాలను కవర్ చేసే బీమా సరిపోతుంది. అయితే ఓ సీనియర్ సిటిజెన్ తన కుటుంబం వద్దకు వెళ్తుంటే.. టికెట్ క్యాన్సలేషన్ ప్రయోజనాలు కలిగిన బీమాను తీసుకోవడం ఉత్తమం. అలాగే విద్యార్థుల టూర్ అయితే వారితో పాటు చాలా వస్తువులు ఉండే అవకాశం ఉంది. ల్యాప్ ట్యాప్ వంటి కాస్ట్లీ వస్తువులు ఉండే అవకాశం ఉంటుంది. వీరికి అవసరమైన పాలసీని వీరు తీసుకోవాల్సి ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు.. మీకు ఎలాంటి కవర్ కావాలో విశ్లేషించుకొని తీసుకోవడం మంచిది.ఏదో ఓ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొని, ఆ తర్వాత మీకు జరిగిన నష్టానికి బీమా వర్తించకపోతే ఇబ్బంది పడేది మీరే. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునేముందు అన్ని డాక్యుమెంట్స్ చదువుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..