AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health: ఈ ఆహారంతో మానసిక సమస్యలకు చెక్.. మెదడు షార్ప్ అవ్వాలంటే ఇవి తినాల్సిందే మరి..

శరీరానికి అవసరమైన పౌష్టికాహారం అందకపోతే మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అనేక మానసిక రుగ్మతలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు.

Brain Health: ఈ ఆహారంతో మానసిక సమస్యలకు చెక్.. మెదడు షార్ప్ అవ్వాలంటే ఇవి తినాల్సిందే మరి..
Healthy Brain
Madhu
|

Updated on: Apr 11, 2023 | 3:30 PM

Share

ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఆహారం చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. శారీరక ఆరోగ్యం మాత్రమే కాక, మానసిక ఆరోగ్యాన్ని కూడా మనం తినే ఆహారం చాలా ప్రభావితం చేస్తుంది. శరీరానికి అవసరమైన పౌష్టికాహారం అందకపోతే మెదడు పనితీరు కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా అనేక మానసిక రుగ్మతలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా మెదడు చురుగా మారడంతో పాటు శరీరానికి అవసరమైన సంకేతాలను వేగంగా పంపిచడం సాధ్యమవుతుందని వివరిస్తున్నారు. మరి శారీరక ఆరోగ్యంతో పాటు మెదడుకి శక్తినిచ్చే పోషకాహారం ఏంటి? ఏమి తింటే మెదడు చురుగ్గా మారుతుంది? అన్న ప్రశ్నలకు ప్రముఖ పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీపై సమాధానం ఇచ్చారు. శారీరక ఆరోగ్యంతో పాటు మెదడును చురుకుగా మార్చే ఆహార పదార్థాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..

ఆమె పోస్ట్ ఇదే..

‘మనం తినే ఆహారమే మన శరీరానికి, మెదడుకు పోషణను అందిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోతే దాని ప్రభావం శరీరంతో పాటు మానసికంగానూ కనిపిస్తాయి.’ అని అంజలీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పోషకహారం లోపిస్తే..

పోషకాహార నిపుణురాలి ప్రకారం, శరీరంలో ఏదైనా విటమిన్, మినరల్ లోపం ఏర్పడితే జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది. విషయాలు సరిగా గుర్తుండవ. ఏకాగ్రత కోల్పతారు. తర్వాత మానసిక స్థితి, స్వీయ-విలువ లేని భావన పెరిగిపోతాయి. మూడ్ స్వింగ్ అవుతుంటుంది. అలాంటి సందర్భాలలో మీ మెదడు ఆరోగ్యం దెబ్బతిందని గ్రహించాలి. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ డైట్ ని మార్చుకోవాలి.

విటమిన్స్.. మినరల్స్..

  • విటమిన్ బి కాంప్లెక్స్ – బి1 (థయామిన్) లోపం జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రలేమి, కడుపు నొప్పి మొదలైన వాటికి దారి తీస్తుంది. నియాసిన్ లోపం వల్ల ఆందోళన, యాంగ్జైటీ పెరుగుతుంది.
  • అదేవిధంగా, విటమిన్ బీ6, బీ12, ఫోలిక్ యాసిడ్ యొక్క లోపం గందరగోళం, బలహీనత మరియు దడ, రక్తహీనత, మానసిక కల్లోలం మొదలైన వాటికి కారణమవుతుంది. అందువల్ల, విటమిన్ బీ తీసుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో, విటమిన్ సి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • శరీరంలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ లోపం ఉంటే తరచుగా కండరాల అలసటకు గురవుతాయి. ఎందుకంటే ఈ ఖనిజాలు మెదడు పనితీరుకు సంబంధించిన అనేక ప్రక్రియలకు అవసరం. విటమిన్ లోపాల కంటే ఖనిజాల లోపాలు వేగంగా ప్రభావం చూపుతాయి.

వీటితో మెదడు ఆరోగ్యం..

సెయింట్ జాన్స్ వోర్ట్.. ఈ హెర్బ్ డిప్రెషన్‌ను నిర్వహించడానికి విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇందులో హైపెరిసిన్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.

కావా కావా.. నరాలను శాంతపరచడానికి, మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది ఉద్రిక్తత, ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మెనోపాజ్ సమయంలో డిప్రెషన్ చికిత్సకు ప్రభావవంతంగా ఉంటుంది.

జింగో బిలోబా.. మానసిక పనితీరును మెరుగుపరచడానికి ఇది ఉత్తమమైన మూలిక. ఇది సెరోటోనిన్-పెంచే ప్రభావాలను కలిగి ఉంది. మంచి న్యూరోట్రాన్స్మిటర్ గా పనిచేస్తుంది. ఇది యాంటి డిప్రెసెంట్ ఎఫెక్ట్, మూడ్-బూస్టింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది.

సరైన విధంగా వాడాలి.. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా మూలికలను సరైన మార్గదర్శకత్వంలో తీసుకుంటేనే దాని పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిపుణులు సూచనల మేరకు ఇతర మూలికలు, విటమిన్లు, ఖనిజాలతో కలిపి తీసుకున్నప్పుడు ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..