కీరదోస.. వీటిలో నీటి కంటెంట్‌తో పాటు ఫైబర్, విటమిన్లు బీ1, బీ2, బీ3, బీ5, బీ6, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్‌లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. అంతేకాక వేడి వేసవి నెలల్లో మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. కాబట్టి, మీరు అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా మీ శక్తి స్థాయిలను తిరిగి పొందడానికి కీరదోసకాయలను తినవచ్చు.