Aadhaar Card: ఆధార్‌ కార్డుదారులకు అలర్ట్‌.. వారి కార్డులపై కేంద్రం కీలక ప్రకటన.. అదేంటో తప్పక తెలుసుకోండి

ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు తీసుకున్న దగ్గరి నుంచి బ్యాంకు అకౌంట్‌ తీయడం, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఆధార్‌ కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో..

Aadhaar Card: ఆధార్‌ కార్డుదారులకు అలర్ట్‌.. వారి కార్డులపై కేంద్రం కీలక ప్రకటన.. అదేంటో తప్పక తెలుసుకోండి
Aadhaar Card
Follow us
Subhash Goud

|

Updated on: Apr 11, 2023 | 4:24 PM

ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్‌ ఒకటి. ఇది లేనిది ఏ పని జరగదు. సిమ్‌ కార్డు తీసుకున్న దగ్గరి నుంచి బ్యాంకు అకౌంట్‌ తీయడం, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పథకాలకు ఆధార్‌ కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌ కార్డు కీలకంగా మారిపోయింది. ప్రభుత్వం నుంచి ఏ పథకం అందుకోవాలన్న ఆధార్‌ కావాల్సిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డుపై కేంద్రం ఓ కీలక సమాచారం ఇచ్చింది. ఆధార్‌ కార్డు ఉన్న వ్యక్తి మరణిస్తే ఆధార్‌ మిస్‌యూజ్‌ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో అలాంటి వారి ఆధార్‌ ఆటోమేటిక్‌గా రద్దు అయ్యే విధంగా కొత్త విధానాన్ని కేంద్రం రూపొందించనుందని వార్తలు వస్తున్నాయి. అంటే చనిపోయిన వ్యక్తి ఆధార్‌ కార్డు రద్దు చేయడం వల్ల అతనికి అందుతున్న అన్ని ప్రభుత్వ పథకాలు నిలిచిపోయానే ఉద్దేశంతో కేంద్రం కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ అంశంపై స్పందించిన కేంద్రం ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ క్లారిటీ ఇచ్చింది.

మరణించిన వారి ఆధార్‌ను డీయాక్టివేట్‌ చేసే విధానంపై కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కార్డును రద్దు చేసే విధానం ఏదీ కూడా అందుబాటులో లేదని, ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు అయితే డీయాక్టివేట్‌ చేసే విధానం ప్రస్తుతం అందుబాటులో లేదని స్పష్టం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నుంచి సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది.

జనన మరణాల దృవీకరణ రిజిస్ట్రేషన్ల చట్టం 1969కి ముసాయిదా సవరణలు చేసి డెట్‌ సర్టిఫికేట్‌ జారీ చేసే క్రమంలోనే ఆధాను స్వాధీనం చేసుకునేలా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే డీయాక్టివేట్‌ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కూడా ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి