AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Currency Note: పెరుగుతున్న నకిలీ నోట్ల బెడద.. నకిలీ నోట్లను గుర్తించండిలా..!

నవంబర్‌లో డీమోనిటైజేషన్ తర్వాత నకిలీ నోట్లను నివారించడానికి బహుళ-పొరలతో ఉన్న నూతన నోట్లు ప్రభుత్వం అందుబాటులో తీసుకువచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం నకిలీ నోట్ల బెడద కూడా ప్రజలు వేధిస్తుంది. గతంలోలా అంత తీవ్రస్థాయి లేకపోయినా కొంత మేర మార్కెట్‌లో నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి.

Fake Currency Note: పెరుగుతున్న నకిలీ నోట్ల బెడద.. నకిలీ నోట్లను గుర్తించండిలా..!
Fake Notes
Nikhil
|

Updated on: Apr 11, 2023 | 5:00 PM

Share

నకిలీ నోట్లు దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. నకిలీ నోట్లు అనే విషయానికి వస్తే 2016కు ముందు 2016కు తర్వాత అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నోట్ల రద్దు చేయడానికంటే ముందు భారతదేశంలో నకిలీ నోట్ల బెడద ఎక్కువ ఉండేది. 2016 నవంబర్‌లో డీమోనిటైజేషన్ తర్వాత నకిలీ నోట్లను నివారించడానికి బహుళ-పొరలతో ఉన్న నూతన నోట్లు ప్రభుత్వం అందుబాటులో తీసుకువచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం నకిలీ నోట్ల బెడద కూడా ప్రజలు వేధిస్తుంది. గతంలోలా అంత తీవ్రస్థాయి లేకపోయినా కొంత మేర మార్కెట్‌లో నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వచ్చే రూ.100, రూ.500 లేదా రూ.2000 నోట్లు ఒరిజనలో? కాదో? తెలుసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తన్నారు. వారు సూచించే ఆ చర్యలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

వాటర్‌మార్క్ కోసం వెతడం

అన్ని భారతీయ కరెన్సీ నోట్లలో వాటర్‌మార్క్ ఉంటుంది. అది నిర్ధిష్ట కాంతిలో పెడితే అది కనిపిస్తుంది. వాటర్‌మార్క్‌లో మహాత్మా గాంధీ చిత్రాన్నినోటుకు ఎడమ వైపున చూడవచ్చు.

సెక్యూరిటీ థ్రెడ్‌ను తనిఖీ చేయడం

భారతీయ కరెన్సీ నోట్లల్లో నిలువుగా నడిచే సెక్యూరిటీ థ్రెడ్‌ను కలిగి ఉంటాయి. పేపర్‌లో థ్రెడ్ పొందుపరిచి ఉంటుంది. అలాగే దానిపై ఆర్‌బీఐ అనే పదాలు, నోట్ డినామినేషన్ ముద్రించి ఉంటుంది. కాంతితో ఆ థ్రెడ్ రంగు మారుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రింటింగ్ నాణ్యత

నిజమైన భారతీయ కరెన్సీ నోట్ల ముద్రణ నాణ్యతతో ఉంటుంది. పదునైన, స్పష్టమైన గీతలతో ఉన్నతంగా ఉంటుంది. నకిలీ నోట్లలో అస్పష్టమైన పంక్తులు లేదా స్మడ్జ్డ్ ఇంక్ ఉండవచ్చు.

సీ-త్రూ రిజిస్టర్

భారతీయ కరెన్సీ నోట్లలో సీ-త్రూ రిజిస్టర్ ఉంటుంది, నోటు ముందు మరియు వెనుక భాగంలో ముద్రించిన నోటు విలువ చిన్న చిత్రం కాంతికి పడినప్పుడు కచ్చితంగా సమలేఖనం అవుతుంది.

సూక్ష్మ అక్షరాలు

భారతీయ కరెన్సీ నోట్లలో సూక్ష్మ అక్షరాలు ఉంటాయి. ఇది భూతద్దంలో చూడగలిగే చిన్న అక్షరంలా ఉంటాయి. సూక్ష్మ అక్షరాలు నిజమైన నోట్లపై స్పష్టంగా, పదునుగా ఉంటాయి కానీ నకిలీ నోట్లపై అస్పష్టంగా లేదా మసకబారి ఉండే అవకాశం ఉంటుంది.

కాగితం నాణ్యత

నిజమైన భారతీయ కరెన్సీ నోట్లు అధిక-నాణ్యత కాగితంపై ముద్రిస్తారు. అలాగే అవి వాటిని పట్టుకున్నప్పుడు మనకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. కాగితం కూడా ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుంది. నకిలీ నోట్లు మృదువుగా లేదా జారేలా అనిపించవచ్చు.

క్రమ సంఖ్య ధ్రువీకరణ

ప్రతి భారతీయ కరెన్సీ నోటుపై ప్రత్యేక క్రమ సంఖ్య ముద్రించి ఉంటుంది. క్రమ సంఖ్య నోట్‌కు రెండు వైపులా ఒకేలా ఉందని నిర్ధారించుకోవాలి. సైడ్ ప్యానెల్‌లో ముద్రించిన క్రమ సంఖ్యతో సరిపోలుతుందని నిర్ధారించుకోవాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి