AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 500 Note: రూ.500 నోటు నకిలీదా..? నిజమైనదా..? గుర్తించడం ఎలా..? ఆర్బీఐ ఏం చెబుతోంది..!

Rs 500 Note: ప్రస్తుతం నకిలీ నోట్ల వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. నకిలీ నోట్లు చెలామణి కాకుండా పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయితే నకిలీ నోటు కూడా..

Rs 500 Note: రూ.500 నోటు నకిలీదా..? నిజమైనదా..? గుర్తించడం ఎలా..? ఆర్బీఐ ఏం చెబుతోంది..!
Subhash Goud
|

Updated on: Feb 02, 2022 | 7:02 AM

Share

Rs 500 Note: ప్రస్తుతం నకిలీ నోట్ల వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. నకిలీ నోట్లు చెలామణి కాకుండా పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయితే నకిలీ నోటు కూడా అసలు నోటులా పోలి ఉండటం కొంత ఇబ్బందికరంగా మారింది. అసలు నోటా నకిలీ నోటా.. అనేది తెలుసుకోవడం సామాన్యులకు కష్టంగా మారుతుంది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) అసలు నోటు.. నకిలీ నోటు ఎలా గుర్తించాలో వివరిస్తోంది. ఎలాగంటే..

1. కరెన్సీ నోటుపై కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో రూ.500 రాసి ఉంటుంది.

2) నోటును కంటి ముందు 45 డిగ్రీల కోణంలో చూస్తే పక్క వైపులా రూ.500 నెంబర్‌ రాసి ఉంటుంది.

3. కరెన్సీ నోటు ముందు వైపు ఎడమవైపు అడ్డంగా 500 నెంబర్ కనిపిస్తుంది.

4. దేవనాగరిలో అదే స్థలంలో రూ.500 అని రాసి ఉంటుంది.

5. నోటుకు మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం కనిపిస్తుంటుంది.

6. గాంధీజీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో India అనే పదాలు కనిపిస్తుంటాయి.

7. నోటును కొద్దిగా వంచి చూస్తే సెక్యూరిటీ త్రెడ్‌ రంగు ఆకుపచ్చ నుంచి నీలిరంగులో మారడాన్ని గమనించవచ్చు.

8. మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీ రాసి ఉంటుంది.

9. సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉండటం గమనించవచ్చు.

10. నోటు కుడివైపున అశోక స్తంభం ఉంటుంది.

11.కరెన్సీ నోటులో ముద్రణ సంవత్సరాన్ని చూడవచ్చు.

12.స్వచ్ఛ భారత్‌ నినాదంతో ముద్రించబడి ఉంటుంది.

13. రూ.500 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది.

14. నోటు సీరియల్‌ నెంబర్‌పైన రూపీ (₹) గుర్తు కనిపిస్తుంటుంది.

15. కరెన్సీ నోటును అంధులు గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తుంటాయి.

16. నోటు వెనుక వైపు ఎడమవైపు కరెన్సీ నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.

17. భాషల ప్యానెల్‌ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో ఐదు వందల నోటు అని రాసి ఉంటుంది. ఇలాంటి కొన్ని గుర్తులను కనిపెట్టడం వల్ల నకిలీ నోటా..? నిజమైనదా? అని తెలుసుకోవచ్చు.

2020, 2021 మధ్య కాలంలో బ్యాంకులు రూ. 5.45 కోట్ల నకిలీ నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ తన ఇటీవలి నివేదికలో పేర్కొంది. మొత్తం 2,08,625 నకిలీ నోట్లు కనుగొనబడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016 డిసెంబర్‌లో పాత రూ.500, రూ.1,000 కరెన్సీ నోట్లను నిషేధించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Budget 2022: బంపర్‌ ఆఫర్స్‌.. నిర్మలమ్మ బడ్జెట్‌లో తగ్గినవి ఇవే.. చౌకగా మొబైల్ ఫోన్స్

Budget 2022: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే..