Budget 2022: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే..

Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా..

Budget 2022: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2022 | 12:58 PM

Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం, సరుకు రవాణా కోసం మరిన్ని కేటాయింపులు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ రంగాల వారికి బడ్జెట్‌ కేటాయింపులపై సభలో వివరించారు. 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంచుతామని మంత్రి నిర్మలా సీతారామణ్‌ పేర్కొన్నారు. భూరికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తామని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. అలాగే ఇదే ఏడాదిలో డిజిటల్‌ కరెన్సీని తీసుకువస్తున్నామని, పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.

బడ్జెట్‌లో మరి కొన్ని ముఖ్యాంశాలు..

► సోలార్​ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు

► దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.19,500 కోట్లు

► కేటాయింపుబొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తి కోసం 4 పైలట్‌ ప్రాజెక్టులు

► ప్రైవేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం

► గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం

► పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్ల కేటాయింపు

► భారత్‌ ఆర్థిక వ్యవస్థ కరోనా ఉత్పాతాన్ని తట్టుకుని బలంగా నిలబడింది.

► ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు వెన్నుదన్నుగా అవసరమైన ప్రభుత్వ పెట్టుబడులు

► మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రసాయం

► దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్ల కేటాయింపు

► పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్‌ బాండ్లు

► గిఫ్ట్‌ సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలకు అవకాశం

► స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు

► అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధన కల్పన

► ఈ ఏడాదే డిజిటల్‌ కరెన్సీ

► పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు

► రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధి

► రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు

► ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు

► ఆర్బీఐ ద్వారా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ

► రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీ

► కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్‌ కరెన్సీ రూపకల్పన

ఇవి కూడా చదవండి:

ఇవి కూడా చదవండి:

Budget 2022: క్రిప్టో కరెన్సీకి ఎదురు దెబ్బ..30 శాతం పన్ను విధింపు.. బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి

Budget 2022: యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో బడ్జెట్‌ ప్రతులు.. డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా..?

Budget 2022: క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు.. కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ముఖ్యాంశాలు ఇవే