Budget 2022: పేదలకు గూడ్ న్యూస్.. ఈ ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల ఇళ్లు..
పేదలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు. తన బడ్జెట్ 2022 ప్రసంగంలో 2022-23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పీఎం ఆవాస్ యోజనకు అర్హులైన..

పేదలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు. తన బడ్జెట్ 2022 ప్రసంగంలో 2022-23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పీఎం ఆవాస్ యోజనకు అర్హులైన లబ్ధిదారుల కోసం 80 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.48,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు భూమి, నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతుల సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందన్నారు.
“అందరికీ గృహాలు” అందించాలనే లక్ష్యాన్ని సాధించడానికి, భారత ప్రభుత్వం గ్రామీణ గృహనిర్మాణ పథకాన్ని రూపొందించిందన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామిన్ (PMAY-G) నవంబర్ 20, 2016న ప్రారంభించారు. ఏప్రిల్ 1, 2016 నుంచి అమలులోకి వస్తుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (PMAY-U) 25 జూన్ 2020 నాటికి ఐదేళ్లు పూర్తయింది.
ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ 2022 కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం సమర్పించారు. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 7.3 సంకోచం తర్వాత మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
Read Also.. Budget 2022: త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్‌లు.. ఇవి మరింత భద్రంగా ఉంటాయటా..



