Digital Rupee: కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ

Cryptocurrency/ Digital Currency update: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. కేంద్ర బడ్జెట్‌

Digital Rupee: కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ ఏడాది నుంచే డిజిటల్ కరెన్సీ
Digital Rupee
Follow us

|

Updated on: Feb 01, 2022 | 12:35 PM

Cryptocurrency/ Digital Currency update: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. కేంద్ర బడ్జెట్‌ (Budget 2022) ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని ఆర్‌బీఐ (RBI) జారీ చేస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుస్తుందని.. వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ డిజిటల్ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ లాంచ్ చేసి మేనేజ్ చేస్తుందని తెలిపారు.

డిజిటల్ లీగల్ టెండర్ సిస్టమ్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వివిధ కేంద్ర బ్యాంకులు డిజిటల్ డాలర్, ఇ-యువాన్, డిజిటల్ యూరో వంటి ప్రాజెక్టులతో ప్రయోగాలు చేస్తున్నాయి.

వినియోగదారులు నష్టాల బారిన పడకుండా ఉండేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ వంటి ఆన్‌లైన్ వ్యాపారాలకు అనుగుణంగా RBI అధికారిక డిజిటల్ కరెన్సీని ఆమోదిస్తుంది. ఇది అన్ని లావాదేవీలకు వర్తించనుంది. డిజిటల్ రూపాయి భౌతిక రూపాయికి సమానం. డిజిటల్ రూపాయి విలువ భౌతిక రూపాయి విలువతో సమానంగా ఉంటుంది.

బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలకు అంతర్లీన విలువ లేదు. అవి అస్థిరంగా ఉంటాయి. బాహ్య పరిస్థితుల కారణంగా విలువలో మార్పులు చోటుచేసుకుంటాయి.

Also Read:

Budget 2022: నిరుద్యోగ యువతకు గూడ్ న్యూస్.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు..