Budget 2022: నిరుద్యోగ యువతకు గూడ్ న్యూస్.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు..

నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు.  దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మేకిన్ ఇండియా ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిర్మల బడ్జెట్ ప్రసంగంలో నాలుగు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి, ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతమివ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ వే కోసం గతిశక్తి మాస్టర్ ప్లాన్, 25 వేల […]

Budget 2022: నిరుద్యోగ యువతకు గూడ్ న్యూస్.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు..
Nirmala
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 01, 2022 | 11:35 AM

నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గూడ్ న్యూస్ చెప్పారు.  దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మేకిన్ ఇండియా ఈ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిర్మల బడ్జెట్ ప్రసంగంలో నాలుగు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి, ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతమివ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ వే కోసం గతిశక్తి మాస్టర్ ప్లాన్, 25 వేల కిలోమీటర్ల హైవేల విస్తరణ చేస్తామని చెప్పారు.

ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తామన్నారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిపీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహిస్తామన్నారు.

పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి చేస్తామన్నారు. కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలున్నాయని చెప్పారు. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధిదేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మల్టీమోడల్‌ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేస్తామని వివరించారు.

Read Also.. Budget 2022: నిరుద్యోగ యువతకు గూడ్ న్యూస్.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు..