Budget 2022: సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ..
కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు...
కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు.
వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి చేస్తామన్నారు. పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహిస్తామని పేర్కొన్నారు. సహజ, సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం అవసరాలను తీర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌లను సవరించాలని రాష్ట్రాలకు సూచిస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
States will be encouraged to revise syllabi of agricultural universities to meet needs of natural, zero-budget & organic farming, modern-day agriculture: FM Nirmala Sitharaman #Budget2022 pic.twitter.com/sq9BG5tkU0
— ANI (@ANI) February 1, 2022
ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం, క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ఏర్పాటు చేస్తామన్నారు.
Read Also.. Budget 2022: నిరుద్యోగ యువతకు గూడ్ న్యూస్.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు..