Budget 2022: క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు.. కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ముఖ్యాంశాలు ఇవే

Budget 2022:  ఎంతగానో ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ రానే వచ్చింది. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ఉదయం 11..

Budget 2022: క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు.. కేంద్ర బడ్జెట్‌ 2022-23లో ముఖ్యాంశాలు ఇవే
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2022 | 11:57 AM

Budget 2022:  ఎంతగానో ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ రానే వచ్చింది. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సభలో మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌న ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

► దేశంలో కొత్త డిజిటల్‌ యూనివర్సిటీ

► త్వరలో నదుల అనుసంధానం

► పెన్నా-కావేరి, కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా అనుసంధానం

► ఐఐటీలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

► క్రెడిట్‌ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్లు

► స్టార్టప్‌ల కోసం రూ.2 లక్షల కోట్లు

► 4 ప్రాంతాల్లో లాజిస్టిక్‌ పార్క్‌లు

► ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ(పీఎంఏవై) ద్వారా 80 లక్షల నిర్మాణాలు

► ఇంటింటికి నీటి పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయింపు

► మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్ టెలీమెడిసిన్ విధానం.

► డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు గత బడ్జెట్ మాదిరిగా ఇప్పుడు కూడా ప్రోత్సహకాలు కొనసాగుతాయని వెల్లడించారు.

► త్వరలో డిజిటల్‌ చిప్‌లతో కూడిన ఈ పాస్‌పోర్ట్‌లు జారీ

► ఈ ఏడాది 4 అంశాలపై అత్యధిక ఫోకస్‌

► ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి

► అభివృద్ధి ఆధారిత పెట్టుబడు, పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు

► 1 నుంచి 12వ తరగతి వరకూ ప్రత్యేక ఛానెల్స్ ఏర్పాటు

► సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

చిన్న, మధ్య తరహ పరిశ్రమలకు క్రెడిట్ గ్యారెంట్ పథకం కింద రూ.2 లక్షల కోట్లు.

► ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు.

► 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లు

► ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడానికి ప్రోత్సాహకాలు

► గత రెండేళ్లలో 5.5 కోట్ల కుటుంబాలకు కుళాయి ద్వారా తాగునీరు సౌకర్యం

►పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు

► విద్యా రంగంలో అధునాతన సాంకేతికకు పెద్దపీట. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు

► దేశ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉంటుందని అంచనా.

► ప్రాజెక్టులో భాగంగా 8 రోప్‌ వేలు నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.

► వచ్చే ఐదేళ్లలో ఆత్మ నిర్బర్ భారత్ పథకం వల్ల 16 లక్షల మందికి, మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా 60 లక్షల మందికి ఉద్యోగాలు

► వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు రూపకల్పన

ఇవి కూడా చదవండి:

ఇవి కూడా చదవండి:

Budget 2022: అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది.. వచ్చే 25 ఏళ్లలో అగ్రదేశంగా భారత్

Budget 2022: పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌