Budget 2022: పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో

Budget 2022: పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2022 | 11:12 AM

Budget 2022: వచ్చే ఆర్ధిక సంవత్సరం(2022 – 23) కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.  వరుసగా నాల్గోసారి ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ను చదివి వినిపిస్తున్నారు. అయితే పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర మంత్రివర్గం సమర్పించే బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈసారి కూడా నిర్మలమ్మ.. ఎర్రటి బ్యాగులో బడ్జెట్​ను తీసుకొచ్చారు. యితే , కోవిడ్ మహమ్మారి మూడవ వేవ్ దృష్ట్యా, కోవిడ్ సంబంధిత సామాజిక దూరం నియమాలను పాటించేలా చూసేందుకు లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు రోజులో వేర్వేరు సమయాల్లో నిర్వహించబడతాయి.

నాలుగోసారి వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ సారి కూడా కరోనా కారణంగా కాగితరహిత బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నారు. ట్యాబ్​లో చూసి బడ్జెట్​ను సభకు చదవి వినిపిస్తున్నారు. ఈసారి బడ్జెట్‌ నిధులు 40 లక్షల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు ఆర్థిక నిపుణులు. గత బడ్జెట్‌ కంటే ఈసారి 14 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఉత్పాదక రంగాని.. ఆ తర్వాత సేవలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని విశ్లేషిస్తున్నా రు ఆర్థిక నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Budget 2022 Speech LIVE: కోటి ఆశలు-ఆకాంక్షలు.. తెలుగింటి కోడలు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం..

Budget 2022: దేశంలో ఏర్పడిన గందరగోళం నుంచి బయటపడే మార్గాలేవి..? ఈ బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు ఉంటాయి?