Budget 2022: బంపర్‌ ఆఫర్స్‌.. నిర్మలమ్మ బడ్జెట్‌లో తగ్గినవి ఇవే.. చౌకగా మొబైల్ ఫోన్స్

Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు . మోదీ ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను..

Budget 2022: బంపర్‌ ఆఫర్స్‌.. నిర్మలమ్మ బడ్జెట్‌లో తగ్గినవి ఇవే.. చౌకగా మొబైల్ ఫోన్స్
Follow us
Subhash Goud

|

Updated on: Feb 01, 2022 | 1:40 PM

Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు . మోదీ ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో సమర్పించారు. అందువల్ల, దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆర్థిక మంత్రి సీతారామన్‌కి ఇది నాలుగో బడ్జెట్‌. బడ్జెట్ తర్వాత ఏ ధరలు పెరుగుతాయి.. ఏ ధరలు తగ్గుతాయి అనే అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తుంటారు. బడ్జెట్ తర్వాత వ్యవసాయ వస్తువులు గిట్టుబాటు కానున్నాయి. ఇది కాకుండా బడ్జెట్‌లో కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం. అంటే, అవి కూడా చౌకగా మారతాయి. అదే సమయంలో విదేశీ గొడుగుల కొనుగోలు ఖరీదైనవి కానున్నాయి. గొడుగులపై కస్టమ్ డ్యూటీని పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.

చౌకగా మొబైల్‌ ఛార్జర్లు:

ఇక మొబైల్ ఫోన్ ఛార్జర్ల ట్రాన్స్‌ఫార్మర్లు, కెమెరా లెన్స్‌లపై దిగుమతి సుంకాన్ని తగ్గించారు. దేశీయ మొబైల్ ఫోన్ ఛార్జర్లు చౌకగా మారనున్నాయి. దేశంలో అసెంబుల్ చేసే మొబైల్స్ కూడా చౌకగా లభిస్తాయి. దేశీయ స్థాయిలో మొబైల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాం.

రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపుపై ప్రతిపాదన!

ఇది కాకుండా, కొన్ని రసాయనాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాలని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. వీటిలో మిథనాల్ కూడా ఉంటుంది. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకే ఇలా చేశామన్నారు. స్టీల్ స్క్రాప్‌పై కస్టమ్ డ్యూటీ మినహాయింపును మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

అలాగే బట్టలు, చెప్పులు, వ్యవసాయ పరికరాలు, విదేశీ యంత్రాలు, మొబైల్‌ ఛార్జర్లు, మొబైళ్లు, తోలు వస్తువుల ధరలు కూడా తగ్గనున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

Budget 2022: పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే..

Budget 2022: క్రిప్టో కరెన్సీకి ఎదురు దెబ్బ..30 శాతం పన్ను విధింపు.. బడ్జెట్‌ సమావేశంలో ప్రకటించిన ఆర్థిక మంత్రి