Budget 2022: కేంద్రం నూతన సంస్కరణ.. దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్..!
కేంద్రం నూతన భూ సంస్కరణలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి విషయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు...
కేంద్రం నూతన భూ సంస్కరణలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి విషయాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని(NGDRS) ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 75,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆన్‌లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి కూడా సీతారామన్ మాట్లాడారు. ఎంటర్‌ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ కొత్త చట్టం ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
Read Also.. Budget 2022: ఈ ఏడాది నుంచి అందుబాటులోకి 5జీ సేవలు.. మారుమూల ప్రాంతాలకు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్..