Budget 2022: కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో పోస్టాఫీసుల అనుసంధానం.. ఆన్‌లైన్‌లో నగదు బదిలీకి అవకాశం..
దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసులు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో అనుసంధించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు...
దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసులు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌తో అనుసంధించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో ప్రజలు పోస్టాఫీస్ ఖాతాను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. పోస్టాఫీసు ఖాతాల నుంచి ఇతర బ్యాంకులకు డబ్బును బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
“2022లో 1.5 లక్షల పోస్టాఫీసుల్లో 100 శాతం కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపైకి వస్తాయి, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ATMల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయొచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు ఆన్‌లైన్‌లో నిధులను బదిలీ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది” అని సీతారామన్ అన్నారు.
ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు, సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడుతుందని నిర్మల అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా సేవింగ్స్ ఖాతా సేవలు, చెల్లింపు బ్యాంక్ సేవలను అందిస్తున్నాయి.
Read Also.. Budget 2022: త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్‌లు.. ఇవి మరింత భద్రంగా ఉంటాయటా..