Budget 2022: బడ్జెట్ ప్రసంగం చిన్నదే.. కానీ ప్రభావం ఎక్కువ ఉండొచ్చు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) మంగళవారం కేంద్ర బడ్జెట్(Budget 2022)ను ప్రవేశపెట్టారు...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) మంగళవారం కేంద్ర బడ్జెట్(Budget 2022)ను ప్రవేశపెట్టారు. దాదాపు 90 నిమిషాల్లో బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఫిబ్రవరి1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించారు. 2019లో నిర్మలా సీతారామన్ దాదాపు 2 గంటల 15 నిమిషాల బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. కానీ ఈసారి తక్కువ సమయం పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. దీనిపై పలువురు స్పందిస్తున్నారు.
మంగళవారం పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ, ” నిర్మలా సీతారామన్ చిన్న బడ్జెట్ ప్రసంగం అత్యంత ప్రభావవంతమైనదిగా నిరూపించవచ్చు” అని ట్వీట్ చేశారు.
Brevity has always been a virtue. @nsitharaman ‘s shortest budget address may prove to be the most impactful…
— anand mahindra (@anandmahindra) February 1, 2022
Read Also.. Budget 2022: త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్‌లు.. ఇవి మరింత భద్రంగా ఉంటాయటా..