FD Interest Rates: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచిందోచ్చ్..
బ్యాంకులు వారిని ఆకర్షించడానికి ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తాయి. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై గణనీయమైన వడ్డీని అందిస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐఓబీ(ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్) కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

కష్టపడి సంపాదించిన సొమ్ముకు నమ్మకమైన రాబడి రావడానికి వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలా పెట్టుబడి పెట్టే వారు ఫిక్స్డ్ డిపాజిట్లల్లో పెట్టడానికి మక్కువ చూపుతారు. ఎందుంకటే మనం పెట్టిన సొమ్ముకు మనం సూచించే నిర్ధిష్టమైన సమయంలో వడ్డీ కచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా ఎఫ్‌డీల్లో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా పెట్టుబడి పెడతారు. రిటైరైన సొమ్మును జాగ్రత్త చేసుకోవడంతో పాటు ఆ సొమ్ముకు నమ్మకమైన వడ్డీ వస్తుందని ఎఫ్‌డీ పెట్టడానికి ఇష్టపడతారు. బ్యాంకులు వారిని ఆకర్షించడానికి ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తాయి. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై గణనీయమైన వడ్డీని అందిస్తున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఐఓబీ(ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్) కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఐఓబీ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 40 బేసిస్ పాయింట్ల వరకు సవరణను ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ తన వెబ్ సైట్‌లో ప్రకటించింది. ఐఓబీ సవరించిన వివిధ చార్జీలతో పాటు పెంచిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి చూద్దాం.
ముఖ్యంగా ఐఓబీ కొన్ని రకాల చార్జీలను కూడా సవరించింది. ఆ సవరించిన చార్జీలు మాత్రం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఐఓబీలో 444 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ గణనీయంగా వడ్డీని ఆర్జించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వడ్డీ రేట్‌ను 7 శాతం నుంచి 7.2 శాతం వరకూ పెంచింది. అయితే ఐఓబీ ట్యాక్స్ సేవర్ డిపాజిట్ రేట్ సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్ల కంటే పైబడిన వారు) 0.75 శాతం అదనపు వడ్డీ రేటును పెంచింది. 7-29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు నాలుగు శాతం వడ్డీ లభిస్తుంది. అంటే 50 బీపీఎస్ పెరుగుతుంది. అయితే 30 – 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు 4.5 శాతం నుంచి 4.25 శాతం పొందుతాయి. అలాగే 46 నుంచి 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల వడ్డీ రేటు 4.75 శాతం నుంచి 4.25 శాతానికి తగ్గింది. 91-179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 4.2 శాతం నుంచి 4.5 శాతానికి పెంచారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం