Fixed Deposit Interest: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. అమల్లోకి నూతన వడ్డీ రేట్లు.. ఎంతో తెలుసా?

ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీని గణనీయంగా పెంచాయి. ఇటీవల తమ ఎఫ్‌డీలపై వడ్డీని పెంచుతున్నామని ప్రకటించిన ప్రముఖ బ్యాంకైన కోటక్ మహీంద్రా ఆ వడ్డీ రేట్లు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా ప్రకటించింది.

Fixed Deposit Interest: ఖాతాదారులకు ఆ బ్యాంక్ శుభవార్త.. అమల్లోకి నూతన వడ్డీ రేట్లు.. ఎంతో తెలుసా?
Fixed Deposit
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Apr 08, 2023 | 9:16 AM

కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లల్లో పొదుపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ వడ్డీ రావడంతో పాటు అవసరమైనప్పుడు మన సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చనే నమ్మకంతో చాలా మంది ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. బ్యాంకులు కూడా వినియోగదారులను అభిరుచులకు తగినట్లుగా ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీని గణనీయంగా పెంచాయి. ఇటీవల తమ ఎఫ్‌డీలపై వడ్డీని పెంచుతున్నామని ప్రకటించిన ప్రముఖ బ్యాంకైన కోటక్ మహీంద్రా ఆ వడ్డీ రేట్లు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా ప్రకటించింది. కాబట్టి కోటక్ మహీంద్రా బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల గురించి ఓసారి తెలుసుకుందాం.

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పుడు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ ప్రజలకు 2.75 శాతం నుంచి 6.20 శాతానికి పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి  6.70 శాతం వరకు అందిస్తోంది. 390 రోజుల అంటే 12 నెలల 25 రోజులు నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు సాధారణ వ్యక్తులకు గరిష్టంగా 7.20 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.70 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 91-120 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. 121179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4.25 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 180 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.50 శాతం అంస్తుంది. అయితే 181 రోజుల నుంచి 363 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 364 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.25 శాతం, 365 రోజుల నుంచి 389 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 7 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 7.00 శాతంగా ఉంది. మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 6.50 శాతం, కానీ నాలుగేళ్లలోపు ఉన్న డిపాజిట్లపై 6.25శాతం మాత్రమే వడ్డీ అందిస్తుంది. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ వద్ద ఫిక్స్‌డ్ డిపాజిట్ కనిష్టంగా రూ. 5,000తో ప్రారంభించవచ్చు.అయితే దీనికి గరిష్ట పరిమితి లేదు. అలాగే ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టవచ్చని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం