Maruti Suzuki: క్రాష్ టెస్ట్ ఫలితాలతో కంగారు.. ఆ కార్ల సేఫ్టీపై సందేహాలు..

మన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కార్లలో మారుతి సుజుకీకి చెందిన ఆల్టో కే10, వ్యాగన్ ఆర్ టాప్ ప్లేస్ ఉంటాయి. తక్కువ ధర, మంచి పనితీరు కనబరిచే ఈ కార్లు మధ్య తరగతి వారికి మంచి ఆప్షన్. అయితే వీటి సేఫ్టీపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో ఈ రెండు కార్లకు దారుణమైన రేటింగ్ వచ్చింది.

Maruti Suzuki: క్రాష్ టెస్ట్ ఫలితాలతో కంగారు.. ఆ కార్ల సేఫ్టీపై సందేహాలు..
Maruti Suzuki Wagon R
Follow us

|

Updated on: Apr 08, 2023 | 10:44 AM

సాధారణంగా కారు కొనుగోలు చేసేటప్పుడు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం. కారు ధర ఎంత? ఫీచర్లు ఏమున్నాయి? మైలేజీ ఎంత? వంటి అనేక అంశాలు చెక్ చేసుకొంటాం. అయితే అతి ప్రాముఖ్యమైన భద్రత విషయాన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఎవరైనా కారు కొనుగోలు చేసే ముందు పరిగణించాల్సిన ప్రాధాన్య అంశం దాని భద్రతే. అయితే కార్ల భద్రత విషయాన్ని మనం ఎలా తెలుసుకోవడం ఎలా? అందుకే గ్లోబల్ ఎన్సీఏపీ(Global NCAP) రేటింగ్ ఉపయోగపడుతుంది. ఆయా కార్లలో ప్రయాణం ఎంత సురక్షితమైందో ఈ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ నిర్వహించి, కార్ల భద్రతకు రేటింగ్ ఇస్తుంది. అంటే ఏదైనా అనుకోని విపత్తు ఎదురైనప్పుడు కారులో ప్రయాణించే వారు ఎంత భద్రంగా ఉంటారో ఈ రేటింగ్ చెబుతుంది.ఈ రేటింగ్ జీరో నుంచి ఐదు వరకు ఉంటాయి. అత్యంత సురక్షిత కారుకు 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది. ప్రమాదాల సమయంలో 5 స్టార్ రేటింగ్ లభించిన కార్లలోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఇటీవల ఈ గ్లోబల్ ఎన్సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో మన దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కి చెందిన వేగన్ ఆర్, ఆల్టో కే 10 కార్లు పేలవమైన రేటింగ్ సాధించాయి. ఎంత పేలవమంటే వేగన్ ఆర్ ఒక రేటింగ్.. ఆల్టో కే 10 కు రెండు రేటింగ్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

క్రాష్ టెస్ట్ ఫలితాలు ఇవి..

ఇటీవల తాజాగా గ్లోబల్ ఎన్సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో భారత్ లోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకీ కి చెందిన వేగన్ ఆర్, ఆల్టో కే 10 కార్లకు అత్యంత పేలవమైన రేటింగ్ లభించింది. ఈ రెండు మోడళ్లలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అంటే కారులో ప్రయాణించే పెద్ద వారి రక్షణకు సంబంధించి వేగన్ ఆర్ కు 1 స్టార్ రేటింగ్, ఆల్టో కే 10 కు 2 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ అంటే కారులో వెనుక భాగాన కూర్చొనే పిల్లల రక్షణకు సంబంధించి రెండు కార్లకు కూడా జీరో రేటింగ్ లభించింది.

భద్రత పెంచుకోవాలని సూచన..

మారుతీ సుజుకీ ఆల్టో కే 10 మోడల్ లో పెద్దలకు ముందువైపు నుంచి ఛాతి భాగం నుంచి తల భాగం వరకు కొంత రక్షణ లభిస్తున్నప్పటికీ.. పక్క వైపు నుంచి సరైన ప్రొటెక్షన్ లేదని గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్ తేల్చింది. అలాగే వేగన్ ఆర్ లో డ్రైవర్ కు ఛాతి భాగంలో సరైన ప్రొటెక్షన్ లేదని ఎన్సీఏపీ తేల్చింది. ఈ రెండు మోడళ్ల సేఫ్టీపై మారుతీ సుజుకీ మరింత కృషి చేయాల్సి ఉందని సూచించింది. అయితే ఈ క్రాష్ పరీక్షల్లో ఫోక్స్ వేగన్ విర్టస్, స్కోడా స్లేవియా కార్లకు 5 స్టార్ రేటింగ్ ను సాధించాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మారుతీ ఏమంటుందంటే..

గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో తమ రెండు ఫేమస్ మోడళ్లు వేగన్ ఆర్, ఆల్టో కే 10 కార్లకు అత్యంత తక్కువ సేఫ్టీ రేటింగ్ లభించడంపై మారుతీ సుజుకీ స్పందించింది. భారత్ లోని సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా తమ మోడల్స్ ఉన్నాయని తెలిపింది. భారత సేఫ్టీ ప్రమాణాలు, యూరోప్ సేఫ్టీ ప్రమాణాలతో సమానంగా ఉంటాయని వెల్లడించింది. ప్రయాణికుల భద్రత కోసం పూర్తి స్థాయిలో ప్రమాణాలను పాటిస్తూ మారుతీ సుజుకీ కార్లను ఉత్పత్తి చేస్తున్నామని తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు