Fixed Deposit Interest: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంక్ శుభవార్త.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ..

బ్యాంకులు కూడా డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందిస్తాయి. ప్రస్తుతం ద్రవ్యోల్భణాన్ని తగ్గించడానికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో అన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచుతున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

Fixed Deposit Interest: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంక్ శుభవార్త.. ఎఫ్‌డీలపై భారీగా వడ్డీ..
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Apr 07, 2023 | 4:39 PM

సాధారణంగా మన పెట్టుబడులకు నమ్మకమైన రాబడి కోసం వివిధ సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు పదవీ విరమణ తర్వాత వచ్చే సొమ్మును పొదుపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎమౌంట్ అలానే ఉన్నా వాటిపై వచ్చే వడ్డీతో చాలా మంది వృద్ధులు జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఆకర్షించడానికి బ్యాంకులు కూడా డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందిస్తాయి. ప్రస్తుతం ద్రవ్యోల్భణాన్ని తగ్గించడానికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో అన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచుతున్నాయి. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్ల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో చేరడానికి గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ సభ్యత్వం అక్టోబర్ 31, 2023 వరకూ చెల్లుబాటు అవుతుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు ఓ సారి తెలుసుకుందాం.

ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీ పథకం రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కస్టమర్‌లకు పరిమిత కాలానికి 0.10 శాతం అదనపు వడ్డీ రేటును ఇస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్న సంవత్సరానికి 0.50 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తుంది అని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ 5 సంవత్సరాల 1 రోజు నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. అలాగే రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలపైన మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఖాతాదారులు తమ ఎఫ్‌డీపై అసలు, పెరిగిన వడ్డీలో దాదాపు 90 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. అలాగే ఎఫ్‌డీ హామీగా కొత్త క్రెడిట్ కార్డుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పథకంలో ఐసీఐసీఐ బ్యాంక్ 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ పథకంలో చేరవచ్చని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం నమ్మకమైన రాబడి కోసం ఐసీఐసీఐ గోల్డెన్ ఇయర్స్‌లో పెట్టుబడి పెట్టేయ్యండి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

ఇవి కూడా చదవండి