Investment Tips: పొదుపు చేయాలంటే అందులో పెట్టుబడి తప్పనిసరి.. ఆర్‌డీల్లో పెట్టుబడితో ఎన్నో లాభాలు
ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువుగా పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడతారు. ఎందుకంటే నెలవారీ వాయిదాల చెల్లింపునకు పోస్టాఫీసులు సౌకర్యంగా ఉంటాయని వారి భావన. అయితే మరికొంత మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా ఇది రిస్క్‌తో కూడుకున్నది కావడంతో ఆర్‌డీల వైపే మొగ్గుచూపుతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఉద్యోగస్తులు ఈ మధ్య ఎక్కువగా సేవింగ్స్‌పై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడికి నమ్మకమైన రాబడి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడానికి వెదుకుతూ ఉంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువుగా పోస్టాఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెడతారు. ఎందుకంటే నెలవారీ వాయిదాల చెల్లింపునకు పోస్టాఫీసులు సౌకర్యంగా ఉంటాయని వారి భావన. అయితే మరికొంత మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా ఇది రిస్క్‌తో కూడుకున్నది కావడంతో ఆర్‌డీల వైపే మొగ్గుచూపుతున్నారు. ఆర్‌డీల్లో పెట్టుబడి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఆర్‌డీలు అంటే ఏంటి?
రికరింగ్ డిపాజిట్లు అంటే పెట్టుబడిదారులకు మూలధన హామీని అందించే రుణ సాధనాలుగా పరిగణిస్తారు. బ్యాంకులు ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి ఆర్‌డీలను అందిస్తాయి. పెట్టుబడిదారులు ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఆర్‌డీలు వీలుగా ఉంటాయి. ఆర్‌డీల్లో పెట్టుబడి వల్ల క్రమశిక్షణ వస్తుంది. అయితే ఆర్‌డీల్లో పెట్టుబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఆర్‌డీ ద్వారా వచ్చిన వడ్డీకి పన్ను మినహాయింపు లేదని గమనించడం ఉత్తమం. అయితే ఆర్‌డీల్లో పెట్టుబడి పెడితే మనకు సొమ్ము అవసరమైనప్పుడు ముందస్తు విత్‌డ్రాకు ఉపయోగపడతాయి. అయితే కొన్ని బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఆర్‌డీ ముందస్తుగా చార్జీలు వసూలు చేస్తాయి.
మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు ఆర్‌డీ మధ్య తేడా ఇదే
మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీలు ఆర్‌డీతో పోలిస్తే కొంచెం సౌకర్యంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీల్లో రోజు, వారం, పక్షం, నెల, త్రైమాసికం లేదా వార్షికంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే నిర్ధిష్ట మొత్తంలా కాకుండా మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆర్‌డీల్లో మాత్రం కొత్త అకౌంట్ తీసుకునే సమయంలో మనం ఎంత పొదుపు చేయాలనుకుంటున్నామో? అప్లికేషన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఎస్ఐపీల ద్వారా పెట్టుబడి పెడితే ఈక్విటీ మార్కెట్‌లో భాగస్వామ్యానికి మంచి మార్గంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో సంపదను నిర్మించడానికి ఉత్తమ మార్గంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ప్రత్యేకించి సాధారణ నెలవారీ ఆదాయం కలిగిన పెట్టుబడిదారులకు ఇది ఉత్తమ మార్గమని వారి వాదన. అయితే ఎస్ఐపీల్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితేనే మంచి రాబడి వస్తుంది. ఎస్ఐపీ ద్వారా వచ్చే రాబడులు మార్కెట్-లింక్డ్ అయినందున వచ్చే రాబడి కూడా అస్థిరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎస్ఐపీల్లో ఉండే ఈఎల్ఎస్ఎస్ పథకంలో పెట్టుబడి పెడితే ఆర్‌డీలానే మూడేళ్ల లాక్-ఇన్ పిరియడ్‌తో నమ్మకమైన రాబడి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌లో అంతగా పరిచయం లేని పెట్టుబడిదారులు ఆర్‌డీల్లో పెట్టుబడి ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లభ్యతతో పాటు రిస్క్‌ల గురించి తెలిసిన పెట్టుబడిదారులు ఎస్ఐపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి