SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి మరిన్ని ప్రయోజనాలు
SBI: ఇటీవల నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు బ్యాంకులు తమ వినియోగదారులకు తీపి కబురు అందిస్తున్నాయి. ఆయా బ్యాంకులు..
SBI: ఇటీవల నుంచి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పలు బ్యాంకులు తమ వినియోగదారులకు తీపి కబురు అందిస్తున్నాయి. ఆయా బ్యాంకులు పలు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన 44 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఎస్‌బీఐ ఇప్పుడు తన ఖాతాదారులకు FD (SBI FD రేట్లు)పై అధిక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంక్ తన కొత్త రేట్లను 13 ఆగస్టు 2022 నుండి అమల్లోకి వచ్చాయి. SBI రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న తన FDలపై వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించింది. వివిధ కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 15 బేసిస్ పాయింట్లు పెంచింది.
సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా పెంచింది. వినియోగదారులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు FDలపై 2.90% నుండి 5.65% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 3.40% నుండి 6.45% వరకు వడ్డీ రేట్లు అందించబడుతున్నాయి. మీరు కూడా బ్యాంకులో FD చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, వివిధ కాల వ్యవధి గల FDపై ఎంత వడ్డీ రేటు లభిస్తుందో తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ FD వడ్డీ రేటు: (2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై)
7 నుండి 45 రోజుల FD – 2.90 శాతం 46 నుండి 179 రోజుల FD – 3.90 శాతం 180 రోజుల నుండి 210 రోజుల FD – 4.55 శాతం 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ -4.60 శాతం 1 నుండి 2 సంవత్సరాలు – 5.45 శాతం 2 నుండి 3 సంవత్సరాలు -5.60 శాతం 3 నుండి 5 సంవత్సరాలు -5.60 శాతం 5 నుండి 10 సంవత్సరాలు – 5.65 శాతం సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు – (2 కోట్ల కంటే తక్కువ)
సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు: (2 కోట్ల కంటే తక్కువ)
7 నుండి 45 రోజుల FD – 3.40 శాతం 46 నుండి 179 రోజుల FD – 4.40 శాతం 180 రోజుల నుండి 210 రోజుల FD-5.05 శాతం 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ-5.10 శాతం 1 నుండి 2 సంవత్సరాలు – 5.95 శాతం 2 నుండి 3 సంవత్సరాలు – 6.00 శాతం 3 నుండి 5 సంవత్సరాలు -6.10 శాతం 5 నుండి 10 సంవత్సరాలు – 6.45 శాతం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటును పెంచారు. RBI రెపో రేటు పెరుగుదల తర్వాత, చాలా బ్యాంకులు తమ FD, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీ రేట్లను గతంలో పెంచాయి. ఆర్‌బీఐ రెపో రేటు 0.50 శాతం పెరిగిన తర్వాత ప్రస్తుతం రెపో రేటు 5.40 శాతంగా ఉంది. అంతకుముందు మే, జూన్ నెలల్లో కూడా సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును పెంచింది. అప్పటి నుండి చాలా బ్యాంకులు తమ FD రేట్లను నిరంతరం పెంచుతూనే ఉన్నాయి. ఇటీవల యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైన బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి