FD Interest Rates Hike : ఆ సంస్థలో పెట్టుబడి పెడితే కళ్లుచెదిరే వడ్డీ.. పైగా ప్రభుత్వ మద్దతు కూడా..
పెట్టుబడికి నమ్మకమైన రాబడి ఉండడంతో పాటు కొద్దిపాటి వడ్డీ తగ్గింపుతోనే మనకు అవసరమైనప్పుడు మనం తిరిగి తీసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఎఫ్‌డీలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ గణనీయంగా పెరిగింది.
మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును నమ్మకమైన రాబడి కోసం వివిధ సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఎందుకంటే పొదుపు మంత్రం పాటించడంతో పాటు కుటుంబానికి ఆర్థిక భరోసానివ్వడానికి నమ్మకమైన పెట్టుబడి సాధనాల కోసం వెతుకుతూ ఉంటాం. ఇలాంటి సమయంలో మంచి వడ్డీ రేటును ఆఫర్ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే పెట్టుబడికి నమ్మకమైన రాబడి ఉండడంతో పాటు కొద్దిపాటి వడ్డీ తగ్గింపుతోనే మనకు అవసరమైనప్పుడు మనం తిరిగి తీసుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఎఫ్‌డీలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ గణనీయంగా పెరిగింది. అందువల్ల అన్ని బ్యాంకులు లేదా సంస్థలు ఎఫ్‌డీలపై వడ్డీ పెంపును ప్రకటిస్తూ ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌డీలపై భారీ వడ్డీని ప్రకటించింది. తన పెట్టుబడిదారులకు 8.25 శాతం వడ్డీ చెల్లిస్తామని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వ మద్దతుతో తమిళనాడు పవర్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును అందిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ఇదే అత్యధికం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని భారీ వడ్డీ ప్రకటించింది.
క్యుములేటివ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఇలా
సీనియర్ సిటిజన్ కోసం తమిళనాడు పవర్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు 8.25% వడ్డీ రేటును అందిస్తుంది. అంటే 60 నెలల కాల వ్యవధిలో క్యుములేటివ్ డిపాజిట్ చేస్తే ఈ వడ్డీ వస్తుంది. అదే మీరు 36, 48 నెలల కాల వ్యవధిని ఎంచుకుంటే మీకు 8 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అయితే కేవలం 12 నెలల క్యుములేటివ్ డిపాజిట్లను ఎంచుకుంటే 7 శాతం 24 నెలలను ఎంచుకుంటే 7.25 శాతం వడ్డీ వస్తుంది.
నాన్ సీనియర్ సిటిజన్లకు ఇలా
క్యుములేటివ్ డిపాజిట్లు సాధారణ డిపాజిటర్లకు 60 నెలల డిపాజిట్‌పై 7.75 శఆతం వడ్డీ రేటును అందిస్తాయి. 36-48 నెలలకు వడ్డీ రేట్లు 7.50 శాతంగా ఉంటాయి. ఇతర పదవీకాలాలు మరింత తక్కువ వడ్డీ రేట్లతో వస్తాయి. అయితే ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ అయినందున పూర్తి భద్రత ఉన్నందున దీర్ఘకాలిక పదవీకాలానికి వెళ్లడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఆన్‌లైన్ డిపాజిట్ చేసే అవకాశం
మీరు ప్లే స్టోర్ స్టోర్ ద్వారా తమిళనాడు పవర్ ఫైనాన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం యాప్‌లో రిజిస్టర్ చేసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం అధికారులు మీ అభ్యర్థనను ధ్రువీకరించాక రసీదు యాప్‌లో ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు యాప్ ద్వారా ఎఫ్‌డీను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇంకేందుకు ఆలస్యం మంచి రాబడి కోసం తమళనాడు పవర్ ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడి పెట్టేయండి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం