Andhra Pradesh: టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఫలించేనా..? ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఆ నలుగురి భేటీ..

మినిట్‌ టు మినిట్‌ ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఏ నలుగురు కలిసినా..రాజకీయాల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్ష టీడీపీలో ఇది మరీ ఎక్కువగా ఉంది..సైకిల్‌ దిగి కమలం పంచన చేరిన సుజనా..టీడీపీనేతలను కలవడంతో మళ్లీ ఏదో జరుగుతోందనే గుసగుస మొదలైంది. సుజనా, ఆలపాటి, కన్నా, నక్కా ఆనంద్‌బాబుల భేటీ వెనకున్న ఆంతర్యమేంటి..సుజనా సొంతగూటికి రావాలనుకుంటున్నారా..లేక బాబుతో బీజేపీ దోస్తీకి తనవంతు సాయం చేస్తున్నారా..సుజనా ఏం మోసుకొచ్చారు. ఏం మోసుకెళ్తున్నారు.

Andhra Pradesh: టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఫలించేనా..? ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ఆ నలుగురి భేటీ..
Bjp Tdp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 03, 2023 | 8:24 AM

వై నాట్‌ 175 అని ముఖ్యమంత్రి జగన్‌..175 స్థానాల్లో వైసీపీని ఓడించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇందుకోసం ఎవరి స్క్రిప్ట్‌ వాళ్లు బ్రహ్మాండంగా రాసుకుంటున్నారు. అందులో భాగంగానే.. ఏ చిన్న అవకాశాన్ని కూడా అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ వదులుకోవడం లేదు. ఇలాంటి సందర్భంలోనే.. సుజనా చౌదరి.. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ కలయిక ఏం చెబుతోంది.. రానున్న రోజుల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పొడుపు పొడుస్తుందా.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా కొంతకాలం.. సైకిల్‌ పార్టీకి అంటీ ముట్టనట్టుగా ఉన్నా..లోలోపల వ్యవహారాలన్నీ చక్కబెడుతూనే ఉన్నారట. ఎన్నికల సమయం దగ్గరకొస్తున్న కొద్దీ.. ఇక సమయం లేదనుకుని నేరుగా సీన్‌లోకి దిగారని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఏపీలో వైసీపీని ఓడించి.. టీడీపీ అధికారంలోకి రావాలంటే.. అందరూ కలిసికట్టుగా ఉండాలనేదే ఈ కలయిక ఆంతర్యంగా తెలుస్తోంది. అందుకే సుజనా అంతదూరం నుంచి వచ్చి..ఆలపాటి ఇంట్లో మీటింగ్ పెట్టారని టాక్.

ఈ నలుగురి భేటీ ఆసక్తికరంగా ఉన్నా..ఏపీ రాజకీయాల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ ఇన్‌సైడ్‌లో ఏదో జరుగుతోందన్న చర్చ మాత్రం చాపకింద నీరులా స్టేట్‌ మొత్తం వ్యాపించింది. ఆలపాటి ఇంట్లో తీరికగా సమావేశమయ్యారని టాక్.. మరోవైపు, కేంద్రం అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నట్లు సుజనా చెప్పారని ఆలపాటి ఆలాపన..ప్రస్తుతం బీజేపీలో పెద్దమనిషి హోదాలో చలామణి అవుతున్న సుజనా..ఢిల్లీ నుంచి ఏదో విలువైన సమాచారాన్ని మోసుకొచ్చారని..తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. సుజనా వచ్చిన వెంటనే అందరూ అక్కడ గుమిగూడి ఏదో గూడుపుఠానీ చేశారని అటు వైసీపీ కేడర్‌ కూడా గుసగుసలాడుకుటోంది. సుజనా మాత్రం టీడీపీ బీజేపీ మధ్య మైత్రిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఆలపాటి మాత్రం.. సుజనాతో తనకు మొదటి నుంచి సత్సంబంధాలున్నాయని..ఎన్ ఆర్ ఐ మెడికల్ కాలేజ్ విషయంలోనూ తనకు అనేక సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ రిలేషన్‌తోనే కమ్మ హాస్టల్‌ వందేళ్ల ఉత్సవాలకు పిలిచానన్నారు. అయినా రాజధాని లేని రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే అందరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆలపాటి అన్నారు.

ఇవి కూడా చదవండి

కమ్మ హాస్టల్ స్థాపించి వందేళ్లయిన సందర్భంగా చేస్తున్న ఉత్సవాల్లో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన సుజనా చౌదరి..ఆలపాటి ఇంటికి వెళ్లి.. స్వామికార్యం, స్వకార్యం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలపై చర్చించి.. 2024లో టీడీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలన్న వాటిపై మంతనాలు సాగించారు. మొన్నటి వరకు బీజేపీలోనే ఉన్న కన్నా.. ఈ మధ్యనే సైకిలెక్కారు. ఇప్పుడు సుజనాతో పలు విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇది కీలక పరిణామమే.. ఆలపాటి ఇంట్లో ఆ నలుగురు ఏం మాట్లాడుకున్నారో కానీ.. ఏపీ మొత్తం హాట్‌ హాట్‌ డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. వైసీపీ సర్కార్ ని తరిమివేస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయని..భేటీ తర్వాత సుజనా చౌదరి చెప్పడంతో..ఆయన రాక వెనుక ఆంతర్యం అందరికీ అర్థమైపోయింది. మరోవైపు, అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేయడం దారుణం అన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సుజనా చౌదరి అన్నారు. ఇకనైనా వైసీపీ తన తీరు మార్చుకుంటే మంచిదని సుజనా చౌదరి హితవు పలికారు. ఏదేమైనా టీడీపీ నేతలతో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మీటింగే చాలా ఆసక్తి రేపుతోంది. ఇది దేనికి సంకేతమనే డిస్కషన్‌ జరుగుతోంది.

గుంటూరులో జరిగిన ఈ ఒకే ఒక్క భేటీ.. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను వేడెక్కించింది. టీడీపీ-బీజేపీ నేతలు పైకి సాధారణ సమావేశం అంటూనే.. పాలిటిక్స్‌పై చర్చించడంతో ఏదో మతలబు ఉందన్న రచ్చ జోరందుకుంది. ఇదంతా ఒక ఎత్తైతే.. సుజనా చౌదరి టీడీపీలోకి చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు, ఏపీ మేలు కోసం ఆలోచించేవాళ్లంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు టీడీపీ నేత

ఓ వైపు ముందస్తు ఎన్నికల ఊహాగానాలు.. మరోవైపు పొత్తుల ఎత్తులపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ.. సుజనా సహా ఆ నలుగురు భేటీ..ఏపీలో ఎటువంటి మార్పులకు తావివ్వబోతోంది..పొత్తులకు పొద్దు పొడుపు అవుతుందా..? లేదా అన్నది వేచి చూడాల్సిందే..

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు