Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఆ స్కూళ్లకు సెలవులు.. వివరాలివే..

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడులు వచ్చేశాయ్..

Andhra Pradesh: ఏపీలో ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఆ స్కూళ్లకు సెలవులు.. వివరాలివే..
Schools Students
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 03, 2023 | 7:55 AM

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్ధులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒంటిపూట బడులు వచ్చేశాయ్. సోమవారం(ఏప్రిల్ 3) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. అలాగే పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూల్స్‌కు సెలవులు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. ఈ సెలవులకు బదులుగా అకాడమిక్ ఇయర్ ముగిసేలోపు ప్రభుత్వ సెలవు దినాల్లో ఆరు రోజుల పాటు క్లాసులు నిర్వహించనున్నారు. ఇక విద్యార్ధులను మధ్యాహ్న భోజనం అనంతరం ఇంటికి పంపిస్తారు.

మరోవైపు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 18 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ ఏడాది నుంచి 6 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి ఉండదని చెప్పిన అధికారులు.. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోందని అన్నారు.